seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 1:53 am Digital Edition : SEEMA KIRANAM

క్యూలైన్ నిర్వహణలో ఇకపై.. | మెరుగైన భక్తుల సౌకర్యాల కోసం అభిప్రాయాన్ని అందించాలని శ్రీవారి సేవకుల నిస్వార్థ సేవను TTD EO కోరారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. బుధవారం నాడు 72,332 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,852 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది.

తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలలకు తమ సూచనలు కూడా అందించారు టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర. గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను సందర్శించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీవారి సదన్ కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వారితో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు.

మెరుగైన భక్తుల సౌకర్యాల కోసం అభిప్రాయాన్ని అందించాలని శ్రీవారి సేవకుల నిస్వార్థ సేవను TTD EO కోరారు

అన్నప్రసాదం, శుభ్రత, క్యూలైన్ నిర్వహణ తదితర వాటి అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్యూలైన్ లల్లో భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే శ్రీవారి సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని, అందువల్ల వారు అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో సూచించారు. సేవకులు అందించే ఫీడ్‌బ్యాక్ భక్తుల సౌకర్యాల అభివృద్ధికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

అంత‌క‌ముందు ఈవో సేవా స‌ద‌న్-2లోని రిసెప్ష‌న్, వెరిఫికేష‌న్, కాంబినేష‌న్ కౌంట‌ర్‌ల‌ను సంద‌ర్శించ‌డం, సేవ‌లకు అందించే స‌దుపాయాల‌ను ప‌రిశీలించారు. అలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు. అనంత‌రం కొంతమంది సేవకులతో మాట్లాడిన వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి చెందారు.

బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో శ్రీవారి సేవకులు సేవలను అందిస్తారని ప్రశంసించారు. వారి సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని, ఇందులో భాగంగానే వారి ఫీడ్ బ్యాక్‌ను రూపొందించినట్లు ఈఓ తెలిపారు. శ్రీవారి సేవ స్వచ్చంద వ్యవస్థలో ప్రవేశపెట్టనున్న సంస్కరణలపై గతంలో టీటీడీ పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వాటి గురించి ముద్దాడ రవిచంద్ర సూచనప్రాయంగా ప్రస్తావించారు. ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్ వైజర్ల సేవా కార్యాచరణ పురోగతి గురించి చర్చించారు.

ఆంగ్ల సారాంశం

మెరుగైన భక్తుల సౌకర్యాల కోసం అభిప్రాయాన్ని అందించాలని శ్రీవారి సేవకుల నిస్వార్థ సేవను TTD EO కోరారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2ను గురువారం తొలిసారిగా సందర్శించిన సందర్భంగా ఈఓ సేవకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను సందర్శించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీవారి సదన్ కు రావడం ఇదే తొలిసారి.

Source link