seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 1:57 pm Digital Edition : SEEMA KIRANAM

కోర్టు సంచలన తీర్పు.. జ్యోతిష్యుడికి 200ఏళ్ల జైలు శిక్ష | తమిళనాడు పోక్సో కోర్టు షాకర్: మైనర్ లైంగిక వేధింపుల కేసులో జ్యోతిష్యుడికి 200 ఏళ్ల జైలు శిక్ష!

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తమిళనాడు పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. వారి విధింపుల కేసులో ఓ జ్యోతిష్యుడికి 200ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధితులకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2021 నవంబర్‌లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా తాజాగా తమిళనాడు పోక్సో కోర్టు తీర్పు.

శివగంగ జిల్లా మనగిరి ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడి వద్దకు.. 2021 నవంబర్‌లో ఓ మహిళ వచ్చింది. తన ఇద్దరు కుమార్తెలకు చదువులో రాణించేలా వేడుకుంది. ఈ కారణంగా తన వెంట ఇద్దరు కుమార్తెలను తీసుకుని రామకృష్ణను వద్దకు వెళ్లింది. ఏదైనా పరిష్కారం చెప్పమని కోరింది. అయితే పిల్లలకు పూజలు చేసి నమ్మించిన జ్యోతిష్యుడు.. వారిని తన ఇంటికి పిలిపించుకున్నాడు.

అలా తల్లిని వేరే గదిలో కూర్చోబెట్టి.. 18 ఏళ్లు, 14 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు బాలికలను వేరే గదిలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారిని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులకు ఏమీ కాకూడదని భావించిన ఆ బాలికలు జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు.

అయితే దాదాపు రెండేళ్ల తర్వాత.. ఆ ఇద్దరు అమ్మాయిలకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలికలకు సంక్రమించే వ్యాధి ఉన్నట్లు తేలింది. దాంతో పిల్లలిద్దరినీ విచారించగా జ్యోతిష్కుడి నిర్వాకం బయటపడింది. ఇక పోలీసుల ఫిర్యాదు మేరకు తిరుపత్తూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

మైనర్ లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు పోక్సో కోర్టు షాకర్ జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష!

అయితే తాజాగా శివగంగ జిల్లా పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి గోకుల్ మురుగన్ ఈ కేసులో కీలక తీర్పు ఇచ్చారు. వారి విధింపుల కేసులో ఆ జ్యోతిష్యుడికి 200ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే బాధితులకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.

Source link