ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలంగా కొలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. సీఎం చంద్రబాబు ఈ వివాదంపై కమిటీని నియమించారు. ఆ కమిటీ కొలికపూడిని విచారించి నివేదిక సమర్పించింది. కాగా, తిరిగి ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కొలికపూడికి తేల్చి చెప్పింది. అయితే.. తాజాగా ఆయన పెట్టుకున్న ఫోన్ స్టేటస్ మరోసారి వివాదంగా మారింది. దీంతో, చంద్రబాబు సీరియస్ అయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి పార్టీ నాయకత్వం ఈ రోజు ఘాటు హెచ్చరిక చేసింది. కొలికపూడి గతంలో ఎంపీ చిన్ని లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలో పార్టీలో కలకలం రేపాయి. విజయవాడ పార్టీలో చిన్ని వర్సెస్ కొలికపూడి పంచాయితీ హైకమాండ్ వద్దకు చేరింది. దీంతో.. ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు నిర్ణయించారు. దీంతో.. పార్టీ నేతలు ఈ ఇద్దరి నుంచి వివరణ తీసుకున్నారు. భవిష్యత్ లో మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయవద్దని సూచించారు. అయితే తాజాగా కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారు. ఆయన తన స్టేటస్ గా పెట్టుకుని కూటమి పాలనపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న స్టేటస్ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారని సమాచారం. దీంతో అసెంబ్లీ లాబీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడారు. ఘాటు హెచ్చరిక చేసారు.

వాట్సప్ స్టేటస్ పై పార్టీ నాయకత్వం ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యవహార శైలిని ఉపక్షించే అవకాశం లేదు, ఇప్పటికే పలుమార్లు హెచ్చరించేలా మార్పు లేకపోతే ఎలా అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిపై వివాదస్పద వ్యాఖ్యలు పోస్టు చేయడం క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరై వివరణ ఇచ్చినా మార్పు రాలేదని పల్లా ఆక్షేపించినట్లు సమాచారం. అయితే, తనకు ఎలా నడుచుకోవాలో సీనియర్లు చెబితే బాగుంటుంది అంటూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు మరొకసారి వివాదం పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాజాగా ఆయన వాట్సాప్ లో పెట్టుకున్న స్టేటస్ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. మూడు రోజుల్లో తాను ముప్పయి ఐదు గ్రామాలకు కుటుంబాలు ఉన్నాను, 48 ఆత్మీయ కలయికను ప్రారంభించినట్లు స్టేటస్‌లో తెలిపారు. ఇంతటితో ఆగకుండా రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు.. పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఆయన స్టేటస్ పెట్టడాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్త నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో.. సీఎం చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
ఆంగ్ల సారాంశం
తాజా వివాదాలపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు