ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమా ప్రాజెక్టుల పై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చారు. కొత్త సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని.. చర్చలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రకటన పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. దీంతో.. పవన్ తాజా నిర్ణయంతో తదుపరి అడుగుల పైన ఆసక్తి.
పవన్ కల్యాణ్ కొత్త సినిమాల పైన ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుల్లో భాగంగానే పవన్ తాజాగా మోహన్ రాజా, దేవా కట్టాతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఏ కొత్త కార్యక్రమానికి సంతకం చేయలేదని, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయన బృందం ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారికంగా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టుల కమిట్‌మెంట్స్‌ను తీసుకోవడం లేదు. కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఇప్పటికైతే కొత్త సినిమాలను మొదలుపెట్టే ప్లాన్ ఏం లేదు. అలాంటిది ఏదైనా అప్‌డేట్ ఉంటే అధికారిక ఛానళ్ల ద్వారా మీకు చేరవేస్తాం. ఓజీ 2 విషయంలో ఏదైనా అప్‌డేట్ ఉంటే సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా ప్రస్తావించారని.

ఇక ఎక్కువ సమయం పాలన.. పార్టీకే కేటాయింపు
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇప్పటికే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమాకు సంతకం చేశాడని తెలిసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అభిమానులు మాత్రం అన్నీ సరైన టైంలో పవన్ కల్యాణ్ ఓజీ 2 ట్రాక్‌లోకి తీసుకువస్తా డని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ నుంచి నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ ముందు వరుసలో ఉండబోతుందన్నది సస్పెన్స్ చిత్రం. ఇదే సమయంలో సీఎంగా ఉండటంతో ఇక సమయం పాలనా వ్యవహారాలు. లోక్ సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం మేర పెంచాలని కేంద్రం డిసైడ్ అయింది. దీంతో, వచ్చే ఎన్నికల్లో జనసేనకు పొత్తులో పెద్ద సంఖ్యలో సీట్లు దక్కనున్నాయి. ఇది.. రాజకీయంగా ఎక్కువగా సమయం కేటాయించి.. వచ్చే ఎన్నికల కోసం పవన్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంగ్ల సారాంశం
తన కొత్త సినిమాలపై తాజా అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ తన కొత్త ప్రాజెక్టులపై పెద్ద నిర్ణయం తీసుకున్నాడు