Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ ప్రకటన! | కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల...

కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ ప్రకటన! | కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన..పౌరులు మీసేవ ద్వారా దరఖాస్తులను కొనసాగించవచ్చు

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక అప్‌డేట్‌ను అందించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పాత కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను జోడించే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు. ఇంకా రేషన్ కార్డులు రానివారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం సామాన్యుల ఇబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు జరగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్య ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డుల కోసం శ్రీకారం చుట్టింది. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు, కుటుంబాలుగా విడిపోయిన వారు, పిల్లలు పుట్టిన వారు చాలా కాలంగా రేషన్ ప్రయోజనాల కోసం దూరమై ఇబ్బంది పడుతున్నారు.

కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన పౌరులు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవడం కొనసాగించవచ్చు

అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ

పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును లింకు పెట్టడంతో కొందరు సంక్షేమ పథకాలు కూడా పొందలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ విధంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియను ప్రారంభించింది.

భారీగా పెరిగిన రేషన్ కార్డులు, లబ్దిదారులు

దీంతో ప్రస్తుతం రేషన్ కార్డుదారుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2026 జనవరి నాటికి ఒక కోటి నాలుగు లక్షల 35 వేల ఎనిమిది వందల నలభై ఎనిమిదికి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య దాదాపు మూడు కోట్ల 36 లక్షలకు చేరినట్లు అధికారులు తెలిపారు.

ఒక్క సంవత్సరంలోనే దాదాపు 14 లక్షల రేషన్ కార్డులు

గత ఏడాది కాలంలోనే ఏకంగా 14. 40 లక్షల కొత్త రేషన్ కార్డులను అందించడానికి పౌరసరఫరాల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇచ్చిన కార్డుల ద్వారా 54.49 లక్షల మంది అదనంగా రేషన్ తీసుకుంటున్నారు. ఇక రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడవలసిన అవసరం లేదని నిరంతరాయంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతుందని అవసరమైనవారు మీసేవ ద్వారా అప్లై చేసుకోవచ్చునని చెప్పారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular