seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 11:32 pm Digital Edition : SEEMA KIRANAM

కొండెక్కుతున్న ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ | ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు త్వరలో 35 శాతం వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ల్యాప్‌టాప్/ డెస్క్‌టాప్ కొనాలనుకుంటోన్నారా? అలాంటి ప్లాన్ ఏదైనా ఉందా? ఉంటే.. నిజంగా త్వరగా కొనడం బెటర్. ఎందుకంటే వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో కనీసం 35 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల తయారీలో వినియోగించే కీలక కాంపొనెంట్ల ధరలకు రెక్కలొచ్చాయి. 45 శాతం అంటే ఇప్పుడున్న రేట్లకు సగానికి పెరిగాయి. దీని ప్రభావం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ పై పడటం ఖాయంగా కనిపించింది.

వ్యాపార వార్తల పోర్టల్ మనీకంట్రోల్ ఓ కథనాన్ని ప్రచురించింది. రేట్లు పెరగడానికి గల అవకాశాలను ప్రదర్శించింది. ప్రాసెసర్లు, గ్రాఫిక్ యూనిట్లు పెరగడం, మెమరీ వంటి భాగాల ధరలు, అలాగే ఇంటెల్ ఎంట్రీ లెవల్ ప్రాసెసర్ల కొరత ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలను సూచిస్తుంది. దీనివల్ల పర్సనల్ కంప్యూటర్ల ధరలు 35 శాతం వరకు పెరగవచ్చు. ఇది ప్రధానంగా డీడీఆర్ ర్యామ్ ధరలు పెరగడం, ఎంట్రీ-లెవల్ ఇంటెల్ ప్రాసెసర్‌ల లభ్యత పరిమితం కావడమే.

ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు త్వరలో 35 శాతం వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది

ఈ భాగాల ఖర్చులు పెరగడం వల్ల ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కొనుగోలు శక్తిపై ప్రభావం పడనుంది. పర్సనల్ కంప్యూటర్ ధరలపై మెమరీ కాంపొనెంట్‌ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి నెలల్లో డీడీఆర్ ర్యామ్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల పరికరాల తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను పెంచారు. తయారీదారులు ఈ అధిక ఖర్చులను బదిలీ చేసే అవకాశం ఉంది. ఇది ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ పరికరాలపై ధరల పెరుగుదలకు కారణం.

మార్కెట్ అనలైజింగ్ కంపెనీ ఐడీసీ ప్రకారం డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేన్‌తో సహా దేశీయ పీసీ మార్కెట్ 2025లో 15.9 మిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాదితో 10.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి పీసీ విక్రయాలు. వార్షిక విక్రయాలు మొట్టమొదటిసారిగా 15 మిలియన్ మార్కును అధిగమించాయి. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో 4.1 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇది వార్షికంగా 18.5 శాతం వృద్ధిని సాధించింది.

పీహెచ్ భారత పర్సనల్ కంప్యూటర్ అమ్మకాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దాని తర్వాత లెనోవో, డెల్, ఏసర్, ఆసుస్ సంస్థలు ఉన్నాయి. అన్ని ప్రధాన విక్రయదారులు కూడా ఏడాది పొడవునా విక్రయాల వృద్ధిని సాధించారు. హార్ముజ్ స్ట్రెయిట్ జలమార్గంలో ఏర్పడిన అంతరాయం సెమీకండక్టర్ల తయారీ ఖర్చులను మరింత పెంచవచ్చు. చిప్స్, ఇతర పీసీ విడిభాగాల ధరలు, వాటి లభ్యత రేట్లను ప్రభావితం చేస్తోంది.

ఆంగ్ల సారాంశం

ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు త్వరలో 35 శాతం వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ప్రాసెసర్‌లు మరియు GPUలతో సహా కీలక భాగాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి, స్థోమతపై ప్రభావం చూపుతోంది. ప్రాసెసర్‌లు, గ్రాఫిక్ యూనిట్లు, మెమరీ వంటి కీలక భాగాల ధరలు పెరగడం, అలాగే ఇంటెల్ ఎంట్రీ లెవల్ ప్రాసెసర్‌ల కొరత ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

Source link