seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 10:59 am Digital Edition : SEEMA KIRANAM

కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు ఖరారు- రేవంత్ కోరుకున్న వారికే…!! | సీఎం రేవంత్ ప్రతిపాదన మేరకు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ప్రకటనకు కాంగ్రెస్ నేతలు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఏకపక్షంగా విజయం సాధించడంతో అధినాయకత్వం ఇక కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం.. పార్టీలో రేవంత్ కోరుకున్న విధంగా పదవుల ఖరారు.. మార్పుల దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఖాళీల భర్తీతో పాటుగా రెండు మూడు మార్పులు ఖాయంగా మారాయి. పార్టీ.. ప్రభుత్వంలో కీలక పదవుల భర్తీకి తుది కసరత్తు జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో మకం వేసారు. ఇక.. రాజకీయంగా మరింత బలోపేతం కావాలని రేవంత్ గురించి. అందుకు హైకమాండ్ సైతం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేబినెట్ విస్తరణ.. నామినేటెడ్ పదవుల్లో రేవంత్ లిస్టుకు ఆమోదం తెలిపేందుకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన సమయంలో సీనియర్లకు నామినేటెడ్ పదవులు అప్పగించారు. ఇక.. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా గ్రేటర్ కు ఎన్నికలు జరగాల్సి ఉంది.

మంత్రివర్గ విస్తరణకు-నామినేట్-పదవుల-ప్రకటన-సీఎం-రేవంత్-ఆసరాగా కాంగ్రెస్-నేతలు-గ్రీన్-సిగ్నల్

దీంతో.. ఆ ఎన్నికలు పూర్తయ్యాక మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది రేవంత్ ఆలోచనగా మారింది. అయితే, కొందరు ఆశావాహులు ఢిల్లీలో తమవంతు లాబీయింగ్ చేస్తున్నారు. రేవంత్ మాత్రం ఎన్నికల్లో మంత్రుల పని తీరు ఆధారంగానే ప్రక్షాళన ఉంటుందని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పార్టీ హైకమాండ్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేలా రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.

రేవంత్ లెక్కలకే ఢిల్లీ ఆమోదం

రానున్న పరిషత్ ఎన్నికలు. ఇలాంటి కీలక సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే, పదవులు దక్కని వారి నుంచి అసమ్మతి వ్యక్తమై ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే కోణంలోనూ హైకమాండ్ ఆరా తీసిన సమాచారం. కేబినెట్‌లో ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డికి పదవి దాదాపు లేదనేది స్పష్టం అవుతోంది. కాగా, ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరిని తప్పిస్తారనే లెక్కలకు అనుగుణంగా కొత్త వారికి ఛాన్స్ దక్కనుంది. టీపీసీసీ చీఫ్ గా ప్రస్తుత కేబినెట్ మంత్రికి అవకాశం కల్పించి.. మహేష్ గౌడ్ ను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. ఢిల్లీ పర్యటన తరువాత రేవంత్ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి ఉంది.

ఆంగ్ల సారాంశం

మంత్రివర్గ విస్తరణ, పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం

Source link