seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 11:15 am Digital Edition : SEEMA KIRANAM

కేంద్ర మంత్రి ని కలిసిన నంద్యాల ఎంపీ

ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు పెట్టాలని కేంద్ర మంత్రి కి ఎంపీ డాక్టర్ బైరెడ్డి వినతి

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్):

ఈనెల 22న జరిగే భారత స్వాతంత్ర్య తొలి పోరాట వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా, ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా అనే పేరును అధికారికంగా ప్రకటించాలని బుధవారం న్యూ ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు ను కలిసి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు ఎదురు నిలబడి ప్రాణాలర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగానికి ఇదే నిజమైన నివాళి అని కేంద్ర మంత్రికి వివరించారు.