తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని నగరానికి బయల్దేరిన ఆ కార్మికులకు విధి వంచించింది. ఐదు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భవన నిర్మాణ పనుల్లో ఈ ప్రమాదం జరిగింది. భవనంలోని ఐదో అంతస్థు వద్ద ఏర్పాటు చేసిన గోవా కర్రలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఆ కర్రలపై ఉన్న భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని టోలీచౌకిలో జరిగింది.
హైదరాబాద్ టోలీ చౌకీలోని అల్ అస్నాత్ కాలనీలో షాకింగ్ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ 10 మంది కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే కర్రల కింద చిక్కుకున్న మృత దేహాలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.

ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురు కార్మికుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా కనిపిస్తోంది. కర్రల కింద పడి గాయాలు కావడంతోపాటు.. వారికి ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనితో మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల వివరాలు, వారి పేర్లు స్వస్థలాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ భవన నిర్మాణ కార్యక్రమాల్లో ప్రమాదవశాత్తూ ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు భవన నిర్మాణ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

