seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 4:39 am Digital Edition : SEEMA KIRANAM

కూతురు పెళ్లి ఆపి అల్లుడితో అత్త జంప్.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్! | అలీఘర్ మిస్టరీ, ప్రేమ కేసులో అత్తగారి షాకింగ్ ట్విస్ట్, అల్లుడు కిడ్నాప్ ఆరోపణలు

భారతదేశం

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లా మడ్రాక్ ప్రాంతంలో వెలుగుచూసిన ఓ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా అత్తా-అల్లుళ్ల మధ్య బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కథ అడ్డం తిరిగింది. తన కూతురికి కాబోయే అల్లుడు రాహుల్‌తో అనిత అనే మహిళ ప్రేమలో పడటమే కాకుండా పెళ్లికి కేవలం 12 రోజుల ముందు అతడితో కలిసి పారిపోవడం(ఏప్రిల్ 2025) పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ బీహార్ సీతామర్హి జిల్లాకు అక్కడ గత 10 నెలలుగా భార్యాభర్తలుగా కలిసి జీవించారు.

అల్లుడి ఆరోపణలు.. మరో వ్యక్తితో పరార్
ఈ ప్రేమ వ్యవహారంలో మొదటి ట్విస్ట్ అల్లుడు రాహుల్ ద్వారా వచ్చింది. 10 నెలల సహజీవనం తర్వాత తన అత్త అనిత.. తన సొంత బావతో (రాహుల్ సోదరి భర్త) కలిసి పారిపోయిందని రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె వెళ్లేటప్పుడు తన వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలను కూడా ఊడ్చుకుపోయిందని, తనను దారుణంగా మోసం చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అలీఘర్ మిస్టరీ ప్రేమ కేసులో అల్లుడు కిడ్నాప్‌కు పాల్పడ్డాడని అత్తగారి షాకింగ్ ట్విస్ట్

అత్త ఎదురుదాడి.. బందీగా ఉంచి మత్తు మందులు:
రాహుల్ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే అనిత స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అసలు నిజాన్ని. తాను ఎవరితోనూ పారిపోలేదని, రాహుల్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డానని ఆమె గుర్తించింది. మొదట్లో ఒక నెల రోజులు తనను బాగానే చూసుకున్న రాహుల్.. ఆ తర్వాత అసలు స్వరూపాన్ని చూపించాడని ఆమె ఆరోపించింది. తనను గదిలో బంధించి ఎక్కడికీ వెళ్లకుండా మత్తు మందులు ఇస్తూ శారీరకంగా, మానసిక హింసకు గురిచేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆర్థిక లావాదేవీల చిక్కుముడి
ఈ వివాదంలో డబ్బు, బంగారం ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదును, నగలను రాహుల్ ఇప్పటికే ఖర్చు చేసేశాడని అనిత ఆరోపిస్తోంది. ఇప్పుడు తన వద్ద ఏమీ మిగలకుండా, తనను వదిలించుకోవడానికి, సమాజంలో బద్నాం చేయడానికి రాహుల్ లేనిపోని కథలు అల్లుతున్న ఆమె వాదిస్తోంది. “నేనే తప్పు చేసి ఉంటే, నేరుగా పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వస్తాను?” అని ఆమె పోలీసులను ప్రశ్నించింది.

ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను పోలీసులు నమోదు చేసుకున్నారు. అత్తా-అల్లుళ్లు ఇద్దరూ మేజర్లు కావడంతో గతంలో వారు స్వచ్ఛందంగా వెళ్లినట్లు రికార్డులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన కిడ్నాప్, బందీ, దొంగతనం ఆరోపణలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో సంబంధం ఉన్న యువతి (అనిత కూతురు),ఇతర కుటుంబ సభ్యులు అవమానంతో తలదించుకుని, ఈ విషయంపై మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

అలీఘర్ మిస్టరీ, అలీఘర్ కేసులో సంచలన ట్విస్ట్. అల్లుడు రాహుల్‌తో కలిసి పారిపోయిన అత్తగారు అనిత, అతను తనను 10 నెలల పాటు బందీగా ఉంచి తనకు మత్తుమందు ఇచ్చాడని పేర్కొంది.

Source link