seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 5:00 am Digital Edition : SEEMA KIRANAM

కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ | MCX వద్ద 10 గ్రాములకు రూ. 159170 వద్ద 24K ఎల్లో మెటల్‌ను డాలర్ బలహీనపరుస్తుంది కాబట్టి బంగారం ధరలు తగ్గాయి.

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ పతనం. క్రమంగా కుప్పకూలుతూ వస్తున్న పసిడి రేట్లకు ఎక్కడా బ్రేకులు పడట్లేదు. రెండు వారాల కనిష్టస్థాయికి క్షీణించాయి. ఈ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,59,170 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్లు రూ. 1,45,900 కు అందుబాటులో ఉంది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో బంగారం వెండి ధరలు పడిపోయాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలను గుర్తించే- ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,59,300 ఉండగా, అహ్మదాబాద్‌లో రూ. 1,59,200 వద్ద ట్రేడ్ అవుతోంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రూ. 1,59,170గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరల్లోనూ పెద్దగా తేడాలు లేవు. ఢిల్లీ, జైపూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,050 వద్ద కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో రూ. 1,45,950 కాగా, పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ. 1,45,900లకు చేరింది.

డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి, 24K ఎల్లో మెటల్ 10 గ్రాములకు రూ. 159170

యూఎస్ స్పాట్ గోల్డ్ 0.2 శాతం మేర తగ్గి ఔన్స్‌కు 5,007.58 డాలర్ల వద్ద స్థిరపడింది. ఏప్రిల్ డెలివరీ కోసం US గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా ఒక శాతం తగ్గి 5,011.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ విలువ స్వల్పంగా తగ్గడంతో ఇతర కరెన్సీల హోల్డర్లకు బంగారం వంటి వస్తువులు చౌకగా మారాయి. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం కూడా బంగారం, వెండి రేట్లపై ప్రభావం చూపింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,101, 22 క్యారెట్లు – రూ. 14,759, 18 క్యారెట్లు – రూ. 12,399

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,917, 22 క్యారెట్లు- రూ. 14,590, 18 క్యారెట్లు – రూ. 11,938

ఆంగ్ల సారాంశం

ఖరీదైన ముడి చమురు కారణంగా డాలర్ బలమైన కారణంగా డాలర్ 24K ఎల్లో మెటల్‌ను బలహీనపరిచినందున బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 159170 వద్ద తగ్గాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,59,170కి తగ్గగా, 22కే బంగారం 10 గ్రాములకు రూ.1,45,900గా ఉంది.

Source link