seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 4:37 am Digital Edition : SEEMA KIRANAM

కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! | చమురు ఎగబాకడం మరియు సేఫ్-హెవెన్ డిమాండ్ పెరగడం వల్ల రిస్క్ విరక్తికి ఆజ్యం పోసినందున భారత రూపాయి డాలర్‌కు రూ. 92 తగ్గింది

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. అయిదో రోజు కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ యుద్ధానికి ఎపిక్ ఫ్యూరీగా పేరు పెట్టింది అమెరికా. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

ఈ పరిణామాలు భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రూపాయి విలువ భారీగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో క్షీణించింది. ఒక డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా 92 రూపాయలను దాటేసింది. ఒక దశలో 92.10 పైసలకు చేరింది. ఒకేసారి 55 పైసల మేర క్షీణించింది. కిందటిరోజు 91.47 వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ ఉదయం డాలర్‌తో పోలిస్తే 55 పైసలు బలహీనపడింది. 92.03 వద్ద. ఇది క్రమంగా 92.08 పైసలకు తాకింది.

చమురు ఎగబాకడం మరియు సేఫ్-హెవెన్ డిమాండ్ పెరగడం వల్ల రిస్క్ విరక్తికి ఆజ్యం పోసినందున భారత రూపాయి డాలర్‌కు రూ. 92 తగ్గింది

ఈ ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ విలువ ఏడు శాతం పైగా పతనమైంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 87 రూపాయల వరకు కనిపించిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి 90 రూపాయలను దాటిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అది అక్కడితో ఆగలేదు. 92 రూపాయలను కూడా దాటేసింది. సురక్షిత ఆస్తుల వైపు విదేశీ పెట్టుబడులు, దేశీయ ఈక్విటీల నిధుల నుండి ఉపసంహరణ రూపాయి క్షీణతకు కారణమయ్యాయి.

కొద్ది రోజుల కిందటే 91 రూపాయల మార్క్ దాటిపోయింది రూపాయి విలువ.. అతి తక్కువ సమయంలోనే 92 ను కూడా దాటడం అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో రూపాయి విలువ దిగజారిపోలేదు.

రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. అటు స్టాక్ మార్కెట్ పై కూడా దీని దుష్ప్రభావం పడింది. సెన్సెక్స్ భారీగా నష్టపోతోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నష్టాలతో ఆరంభం అయ్యాయి.

ఆంగ్ల సారాంశం

ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ యుద్ధం చమురు ధరలను పెంచడం, సురక్షితమైన స్వర్గధామం డాలర్‌కు డిమాండ్‌ను పెంచడం మరియు ప్రమాద విరక్తిని పెంచడం వంటి కారణాలతో భారత రూపాయి బుధవారం జీవితకాల కనిష్టానికి డాలర్‌కు 92 కంటే బలహీనపడనుంది.

Source link