seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 4:10 pm Digital Edition : SEEMA KIRANAM

కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు

[ad_1]

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-కొరివి జయకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. లోకేష్ – బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకొని వీరంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ విధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీఎం కుటుంబానికి గాయత్రి నిలయంలో ప్రత్యేక స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో సహా పలువురు వారిని ఆహ్వానించారు.

రేపు శ్రీవారి దర్శనం..

ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రత్యేక వసతుల్లోకి వెళ్లింది. వీరంతా ఈరోజు రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య దర్శనం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దేవాన్ష్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారి ఆశీస్సులు పొందనున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవాన్ష్ పుట్టినరోజును ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు.

తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

భద్రత కట్టుదిట్టం..

ప్రముఖుల రాకతో తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్, క్యూలైన్ నిర్వహణలో మార్పులు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

తిరుమలకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కొంతమంది భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి ముఖ్య సందర్భంలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడం చంద్రబాబు కుటుంబానికి సాంప్రదాయకంగా మారింది. ముఖ్యంగా కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు వంటి సందర్భాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

[ad_2]

Source link