seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 10:42 am Digital Edition : SEEMA KIRANAM

కుంగిన భూమి.. మ్యాసివ్ సింక్ హోల్: గగుర్పాటు సీసీటీవీ ఫుటేజీలో | దిగ్భ్రాంతికరమైన షాంఘై సింక్‌హోల్ రోడ్డు మార్గం మరియు సమీపంలోని భవనాలను స్వాలోస్, సెక్యూరిటీ కెమెరాలు భారీగా బంధించాయి

అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

చైనాలోని షాంఘైలో అనూహ్య సంఘటన జరిగింది. ఓ రోడ్డు మొత్తం కుంగిపోయింది. రహదారిపై హఠాత్తుగా భారీ గొయ్యి ఏర్పడింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డు అది. ఓ భాగం కూడా భూమి కబళించివేసింది. ఇంత పెద్ద మొత్తంలో భూమి కుంగిన ప్రభావం సమీప భవనాలపై పడింది. వాటికీ నష్టం వాటిల్లింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని ఒరిగిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

రోడ్డును రెండు వైపులా నిలిపివేసి, దాని పక్కనే నిర్మాణ పనులు కొనసాగుతున్న దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో చూడొచ్చు. ఒకవైపు నిర్మాణ సామాగ్రి, తాత్కాలిక కేంద్రాలు, మరోవైపు పదుల సంఖ్యలో కార్మికులు అక్కడి సైట్‌లో పని చేస్తుండటం ఇందులో రికార్డు అయింది. అదే సమయంలో ఉన్నట్టుండి భూమి కుంగిపోయింది. మొదట రోడ్డు మొత్తం బీటలు వారింది. ఆ తర్వాత ఓ భారీ గుంత ఏర్పడింది. భూమి కుంగుతున్నప్పుడు కన్ స్ట్రక్షన్ సైట్ లో ఉన్న భారీ నిర్మాణ సామాగ్రి మొత్తం అందులో పడిపోయింది.

దిగ్భ్రాంతికరమైన షాంఘై సింక్‌హోల్ రోడ్డు మార్గం మరియు సమీపంలోని భవనాలను స్వాలోస్ సెక్యూరిటీ కెమెరాలు భారీగా బంధించాయి

షాంఘైలో భూమి కుంగిపోవడం సాధారణం. ఇక్కడి మెత్తటి ఒండ్రు నేలలు, భూగర్భ జలాల వెలికితీత పనులు, నేలకింద పలచటి ఇసుక పొరలు, పాత మౌలిక సదుపాయాలే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి- చిన్నపాటి గుంతలు మొదలుకుని ఇటువంటి భారీ కుంగుబాటులకు దారితీస్తుందని అంటున్నారు. తాజా ఘటన జనసాంద్రత గల పట్టణాల్లో మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన పెరిగింది.

2024 జనవరిలో షాంఘైలోని మిన్‌హాంగ్ జిల్లాలో మురుగునీటి పైపు పగిలిపోవడంతో రహదారి దాదాపు 10 మీటర్లు కుంగింది. 2017 నుంచి 2023 వరకు చైనా వ్యాప్తంగా భూమి కుంగిపోయిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వీటిలో దాదాపు 72 నుంచి 80 శాతం వరకు మానవ తప్పిదాలే. ప్రాథమిక సదుపాయాల లోపాలు, నిర్మాణ సమస్యలలో చోటుచేసుకునే లోపాల వల్లే డేటాని స్పష్టం చేస్తోంది. తాజాగా షాంఘైలో సంభవించింది కూడా అలాంటిదేనని చెబుతున్నారు.

ఆంగ్ల సారాంశం

చైనాలోని షాంఘై సింక్‌హోల్ రోడ్డుమార్గాన్ని మరియు సమీపంలోని భవనాలను స్వాలోస్, సెక్యూరిటీ కెమెరాల క్యాప్చర్. ఫుటేజీలో రోడ్డు లోపలికి వెళ్లడం, సమీపంలోని నిర్మాణాలను మ్రింగివేయడం మరియు ఖాళీ శూన్యతను సృష్టించడం చూపిస్తుంది. తాజా ఘటన జనసాంద్రత గల పట్టణాల్లో మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన పెరిగింది. గతంలో కూడా మిన్‌హాంగ్ జిల్లాలో దాదాపు 10 మీటర్లు కుంగింది.

Source link