seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 10:44 am Digital Edition : SEEMA KIRANAM

కార్పొరేట్ ఇంటర్ ప్రాంచైజీల మాయాజాలం

🔹 కార్పొరేట్ ఇంటర్ ప్రాంచైజీల మాయాజాలం 

 

🔹 అనుమతులు లేకుండా విచ్చల విడిగా అడ్మిషన్లు 

 

 🔹 రెండు లక్షల పైన ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు

 

🔹చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, వాల్మీకి బాలక్రిష్ణ 

 

కర్నూలు ప్రతినిధి, మే 11, (సీమకిరణం న్యూస్):

 

కార్పొరేట్ ప్రాంచైజీ విద్యాసంస్థల మాయాజాలానికి కర్నూలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బలవుతున్నారని, అనుమతులు లేకుండానే కార్పొరేట్ ప్రాంచైజీల పేరుతో ఇంటర్‌ అడ్మిషన్ల కోసం జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందు కోసం ప్రాంచైజీ కార్పొరేట్‌ సంస్థలు ఏజెంట్లను రంగంలోకి దింపారని, ఆ ఏజెంట్లు విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ ఇంటర్‌, ఎంసెట్‌, ఐఐటీ, జేఈఈ అంటూ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ వాల్మీకి బాలక్రిష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ నూర్ కమల్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక కర్నూలు నగరంలోని కలెక్టరేట్ పిజిఆర్ఎస్ నందు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆలస్యంగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజులు పెరుగుతాయని, సీట్లు దొరకవని పీఆర్వోల ద్వారా కార్పొరేట్‌ ప్రాంచైజీ కళాశాలలు చెబుతున్నాయని, అనుమతులు లేకుండా దర్జాగా తల్లిదండ్రుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ఒప్పించి అడ్మిషన్‌ ఒప్పందాలు చేస్తున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా సుమారు రెండు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పీఆర్వోలు, ఎంజెంట్లు మాటలు విని చేర్పించిన తరువాత హాస్టల్‌లో సరైన వసతి లేకపోవడం, భోజన సౌకర్యం సరిగ్గా లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వసతులు లేక చదువు మానేసిన సంఘటనలు వివరించారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి కార్పొరేట్ ప్రాంచైజీలు రేజోనెన్స్, అలెన్, వేదాంతు, న్యానో సంస్థల పై చర్యలు తీసుకోవాలనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు కిరణ్, చంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.