తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->రాష్ట్రంలో అనేక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లాలలో చోటు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలను పంచి వారికి ఓటేయాలని అభ్యర్థించారు. తీరా ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత తాము ఇచ్చిన బహుమతులు తిరిగి తమకు ఇవ్వాలని ఇంటింటికి తిరిగి మరీ వసూలు చేశారు. దీనికి సంబంధించి అనేక ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన బహుమతులపై రచ్చ
నిన్నటికి నిన్నటికి నిన్న ఓటు వేశానని దేవుడి మీద ఒట్టేసి చెప్పు లేదంటే డబ్బులు ఇస్తాను అంటూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 9 బహువ డివిజన్ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి జాది తిరుపతి తాలూకా కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తే, తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా భువనగిరిలో ఒకటవ వార్డు తరపున పోటీ చేసి ఓటమిపాలైన రచ్చబండను కొనసాగించండి.

అభ్యర్థి ఇచ్చిన బహుమతులు రోడ్డుపై పడేసిన ఓటర్లు
భువనగిరి ఒకటవ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరూపారాణి చీరలు, హాట్ బాక్సులు, కుక్కర్లను స్థానిక ఓటర్లకు పంపిణీ చేసింది. ఇక వీటిని ఓటర్లు బహిరంగంగా రోడ్డుపై ఉంచి, గిఫ్టులు ఇచ్చి ఇప్పుడు గొడవ చేస్తున్నారంటూ రచ్చ చేశారు. ఓట్లు వేయలేదని దాడులు చేస్తారా? మీ గిఫ్టులు మాకు వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు వాటిని రోడ్డుపై పడేశారు.
ఓటర్ల ఇళ్లపై దాడులకు దిగిన ఓడిన అభ్యర్థి తరపు బంధువులు
స్వరూపరాణి తాలూకా బంధువులు, అనుచరులు ఆమె ఎన్నికలలో ఓడిపోయిందని తమ పైనా దాడులు చేస్తున్నారంటూ. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వారంతా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.స్వరూపారాణి దగ్గర డబ్బులు, బహుమతులు తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి వారు ఓటు వేశారని ఆమె అనుచరులు ఆరోపిస్తూ ఇళ్లపైన దాడులు చేశారు.
ఇళ్ళపైకి గాజుసీసాలు విసిరి దాడులు.. పోలీసులకు ఫిర్యాదు
రాత్రి వేళల్లో వార్డులోని కొన్ని ఇళ్లపైకి గ్లాసు సీసాలు విసిరి నోటికొచ్చినట్టు దూషించారు. వీరితో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, వారికి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. అయితే ఈ దాడులకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్వరూపారాణి దాని ఓటర్లకు ఎటువంటి బహుమతులు పంపిణీ చేయలేదని వివరించారు. ఏది ఏమైనా ఈసారి ఓటర్లు బహుమతులు ఎవరు ఇచ్చినా, ఓటు ఎవరికి వేయాలనుకుంటే వారికే వేసినట్లుగా స్పష్టంగా కనబడుతుంది.
ఆంగ్ల సారాంశం
యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపారాణి ఓడిపోయారని ఆరోపించిన తర్వాత ఓటర్లకు బహుమతులు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు మద్దతు ఇవ్వని ఓటర్ల ఇళ్లపై ఆమె మద్దతుదారులు దాడి చేశారని, స్థానికులు ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన బహుమతులను తిరిగిచ్చారని స్థానికులు పేర్కొన్నారు.