Wednesday, April 8, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకశ్మీర్-వైష్ణోదేవీ యాత్రలకు గౌరవ్ భారత్ రైళ్లు-స్టాప్ లు, బుకింగ్స్, ప్యాకేజీ ఇలా..! | కాశ్మీర్ &...

కశ్మీర్-వైష్ణోదేవీ యాత్రలకు గౌరవ్ భారత్ రైళ్లు-స్టాప్ లు, బుకింగ్స్, ప్యాకేజీ ఇలా..! | కాశ్మీర్ & వైష్ణో దేవి: గౌరవ్ భారత్ ప్రత్యేక రైలు ప్రకటించబడింది – మార్గాలు, బుకింగ్ మరియు ప్యాకేజీలు

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఈ సీజన్‌లో హిమాలయాల సానువుల్లోని వైష్ణోదేవి ఆలయంతో పాటు కాశ్మీర్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం గౌరవ్ భారత్ (గౌరవ భారత్) ప్రత్యేక రైలును ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి స్టాప్ లు ఇచ్చారు. అలాగే ప్రత్యేక రైలు అయినందున ఐఆర్సీటీసీలో టికెట్ల బుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్టాప్ లు ఏంటి?, బుకింగ్స్ ఎలా, ఇతర వివరాలను ఓసారి చూసేద్దాం..

కశ్మీర్, వైష్ణోదేవి యాత్రలకు గౌరవ్ భారత్ రైళ్లు (గౌరవ భారత్)

ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి 23 వరకూ మొత్తం 13 రోజుల పాటు ఈ యాత్రకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులోని మధురైలో బయలుదేరే గౌరవ్ భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా కాశ్మీర్ కు వెళ్తుంది. గౌరవ్ భారత్ రైలు-టూరిజం శాఖ ఆమోదించిన ఆపరేటర్ టూర్ టైమ్స్ సహకారంతో ఈ యాత్ర చేపడుతోంది. ఈ ప్రత్యేక రైలుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీలో అవకాశం లేదు. కాబట్టి ప్రయాణికులు 93550 21516 నంబర్ కు కాల్ చేసి అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆన్ లైన్ లో www.tourtimes.in వెబ్ సైట్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

కాశ్మీర్ amp amp వైష్ణో దేవి గౌరవ్ భారత్ ప్రత్యేక రైలు ప్రకటించబడింది - రూట్ల బుకింగ్ మరియు ప్యాకేజీలు

13 రోజుల యాత్ర ప్యాకేజీలివే

కాశ్మీర్ యాత్రకు బుక్ చేసుకునే ట్రైన్ లో ఆగ్రా, ఢిల్లీ, అమృత్ సర్, శ్రీనగర్, గుల్ మార్క్, సోనే మార్గ్ ను కవర్ చేస్తారు. ఈ రైలు 13 రోజుల యాత్రకు ఒక్కొక్కరికి సెకండ్ స్లీపర్ కు రూ.42400, ధర్డ్ ఏసీకి 54 వేలు, సెకండ్ ఏసీకి61 వేలు, ఫస్ట్ ఏసీకి 68,200 టికెట్ ధరలు నిర్ణయించారు. అలాగే వైష్ణోదేవి యాత్రకు బుక్ చేసుకునే రైలులో ఆగ్రా, మథుర, హరిద్వార్, రుషికేష్, కురుక్షేత్ర, వైష్ణోదేవి, అమృత్ సర్, ఢిల్లీ కవర్ చేస్తారు. ఈ రైలులో 13 రోజుల యాత్రకు ఒక్కొక్కరికి సెకండ్ స్లీపర్ కు రూ.36800, ధర్డ్ ఏసీకి రూ.58,440, సెకండ్ ఏసీకి రూ.54,300 వేలు, ఫస్ట్ ఏసీకి 65,700 టికెట్ ధరలు నిర్ణయించారు.

కాశ్మీర్ amp amp వైష్ణో దేవి గౌరవ్ భారత్ ప్రత్యేక రైలు ప్రకటించబడింది - రూట్ల బుకింగ్ మరియు ప్యాకేజీలు

తెలుగు రాష్ట్రాల్లో స్టాప్ లు

తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రైళ్లకూ రాయలసీమలోని పెనుకొండ, తెలంగాణలో ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో స్టాప్ లు ఇచ్చారు. విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారి కోసం టూర్ ఆపరేటర్ సికింద్రాబాద్ వరకూ ట్రాన్స్ పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నారు. దీనికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ రైలులో పబ్లిక్ అనౌన్స్ మెంట్ ఎంటర్ టైన్మెంట్ సిస్టమ్స్, ఆన్ బోర్డ్ టూర్ మేనేజర్లు, సెక్యూరిటీ, దక్షిణభారత భోజనం అందుబాటులో ఉన్నాయి. ఇందులో 650 మంది ప్రయాణికులు ఎక్కవచ్చు. వసతి, సందర్శన, బస, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్టీసీ, ఎల్ఎఫ్సీ సౌకర్యాలు ఉంటాయి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular