seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:32 am Digital Edition : SEEMA KIRANAM

కల్లూరులో ఎస్‌ఐఆర్ ప్రత్యేక క్యాంప్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కల్లూరులో ఎస్‌ఐఆర్ ప్రత్యేక క్యాంప్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

 

 

బీఎల్‌ఓలకు కీలక సూచనలు.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం

 

 

కల్లూరు, జూలై 11, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా కల్లూరు గ్రామ పరిధిలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. కల్లూరు పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 100 నుంచి 120 వరకు ఉన్న అన్ని బూత్‌లకు సంబంధించి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌లో సంబంధిత బీఎల్‌ఓలు పాల్గొని విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో క్యాంప్‌కు హాజరై ఎన్యుమరేషన్ ఫార్మ్‌లు నింపడంతో పాటు ఓటరు జాబితా సవరణలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. బీఎల్‌ఓలు ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు అందించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కొనసాగించారు. క్యాంప్‌ను కర్నూలు జాయింట్ కలెక్టర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) నూరుల్ ఖమర్, ఏఈఆర్‌ఓ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీ అందాల పరిశీలించారు. వారు ప్రతి బీఎల్‌ఓ వద్దకు వెళ్లి నిర్వహిస్తున్న పనులను పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ బీఎల్‌ఓలు మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, గుర్తించలేని ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే స్వీకరించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, అవసరమైన పత్రాలతో ఫార్మ్‌లను సక్రమంగా సమర్పించాలని అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.