seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 9:11 am Digital Edition : SEEMA KIRANAM

కల్తీ నెయ్యి కేసులో ఊహించని మలుపు, ఇక నెక్స్ట్..!! | లడ్డూ కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ విచారణను ప్రారంభించింది సిట్ నుండి వివరాలు కోరింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కల్తీ నెయ్యి కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిట్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జీ షీట్లలో కీలక అంశాలను ప్రస్తావించింది. సిట్ నివేదిక ఆధారంగా రాజకీయ విమర్శలు పతాక స్థాయికి చేరాయి. సిట్ నివేదిక ఆధారంగా గతంలో నూ ఈవో గా పని చేసిన ఈవో అనీల్ కుమార్ సింఘాల్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇదే సమయంలో ఈ కేసులో చోటు చేసుకున్న తాజా పరిణామం సంచలనంగా మారుతోంది.

తిరుమల నెయ్యి వివాదంలో ఇప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును సిట్ విచారణ చేసి.. అనేక అంశాలను గుర్తించారు. రూ.235 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు. దీంతో, ఈ వ్యవహారంలో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్ నుంచి తాజాగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటిదాకా దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లో హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్ర గురించిన సమాచారం ఈడీ విచారణకు సిద్దం అయింది. ఈ కేసులో భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కనిపిస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ వివరాలు కోరింది. పూర్తి సమాచారం రాబట్టేందుకు సిద్దమైంది.

లడ్డూ కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభం

నగదు లావాదేవీల పై ఆరా

సిట్‌లో టీటీడీకి నెయ్యి సరఫరా వివరాలు… ఏ సంస్థ నుంచి ఎంత మేర సరఫరా చేసారు.. అందులో నాణ్యత ఎంత వంటి అంశాలపై పూర్తి స్థాయి సమాచారం సేకరించింది. తమ సంస్థతో పాటు వైష్ణవి, ఏఆర్, మాల్‌గంగా డెయిరీల టీటీడీకి సరఫరా చేసిన భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లు ఈ అక్రమ కార్యకలాపాల కోసం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్‌లలోని హవాలా ఏజెన్సీల ద్వారా డబ్బు చెల్లింపులు జరిగినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందీ… ఎవరికి నగదు ముట్టింది వంటి అంశాల పైన ఆరా తీస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బు ఏం చేశారు ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తు చేయనుంది. దీంతో.. ఈడీ ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇవ్వనుంది.. ఏం తేల్చనుందీ.. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారుతోంది.

ఆంగ్ల సారాంశం

ఈ తిరుమల లడ్డూ కల్తీ ఆపరేషన్‌కు సంబంధించిన మనీ ట్రయల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది

Source link