seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 12:40 pm Digital Edition : SEEMA KIRANAM

కర్నూలు నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం

రేపు నగరమంతా తాగునీటి సరఫరాకు అంతరాయం

 

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

 

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు నగరంలోని అశోక్ నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రంలో నీటి సరఫరా నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నందున, సోమవారం నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత పలు కాలనీల్లో మాత్రమే తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని భావించినప్పటికీ, నీటి శుద్ధి కేంద్రంలోని అన్ని యంత్రాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అవసరమైన నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నందున నగరమంతా నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని తెలిపారు. కావున ప్రజలు గమనించి, సహకరించాలని కమిషనర్ కోరారు.