కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతిష్టించిన పరిపాలన వినాయకునికి జిల్లా కలెక్టర్ డా ఏ. సిరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఉద్యోగులు మరియు అధికారుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని,పరిపాలనా పరంగా అన్ని శాఖల్లోనూ సత్ఫలితాలు రావాలని కోరుకుంటూ కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక స్వామిని దర్శించుకున్నారు. వినాయకుని ఆశీస్సులతో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.