కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, మార్చి 31, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం ఇంచార్జ్ మంత్రికి ఎస్పీ పూల మొక్కను అందజేశారు.

