seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 2:00 pm Digital Edition : SEEMA KIRANAM

కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సమావేశం

కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సమావేశం

 

విజయవాడ, జూన్ 10, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ గుప్తా జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. విజయవాడలోని జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యాం కుమార్ , ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి మీనాక్షి నాయుడు, మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు ఇంచార్జి వైకుంఠం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, పెండింగ్ పనుల పూర్తి, ప్రజా సమస్యల పరిష్కారంపై సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.