seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 10:40 am Digital Edition : SEEMA KIRANAM

కర్నూలు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు

 

జిల్లాలో 8 మండలాల్లో ఎన్నికల నిర్వహణ – కలెక్టర్ డా. ఏ. సిరి

 

కర్నూలు ప్రతినిధి, నవంబర్ 13 (సీమకిరణం న్యూస్):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు–2026 మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో తొలి విడతలో మొత్తం 8 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ ఇలా..

నవంబర్ 15: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.

నవంబర్ 17: నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు. సాయంత్రం 5 గంటల వరకు.

నవంబర్ 18: నామినేషన్ల పరిశీలన.

నవంబర్ 19: తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లకు చివరి తేదీ.

నవంబర్ 20: అప్పీళ్ల పరిష్కారం.

నవంబర్ 21: మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థిత్వాల ఉపసంహరణ. అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటన.

నామినేషన్ల స్వీకరణ ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తొలి విడతలో ఎన్నికలు జరిగే 8 మండలాలు

ఆదోని రెవెన్యూ డివిజన్:

ఆదోని–1

ఆదోని–2

హోళగుంద

పత్తికొండ రెవెన్యూ డివిజన్:

4. ఆలూరు

5. ఆస్పరి

6. చిప్పగిరి

7. దేవనకొండ

8. హాలహర్వి

తొలి విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. ఆశావహులు, రాజకీయ నాయకులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.

 

– సీమకిరణం తెలుగు దినపత్రిక