seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 9:01 am Digital Edition : SEEMA KIRANAM

కర్నూలులో ‘ఫ్రాంక్ఫిన్’ ఆధ్వర్యంలో ఎయిర్ హోస్టెస్ ఉచిత కెరీర్ కౌన్సిలింగ్

కర్నూలులో ‘ఫ్రాంక్ఫిన్’ ఆధ్వర్యంలో ఎయిర్ హోస్టెస్ ఉచిత కెరీర్ కౌన్సిలింగ్

విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన
కర్నూలు ప్రతినిధి, జూలై 19, ( మహా జ్యోతి న్యూస్):
విమానయాన, హాస్పిటాలిటీ, ట్రావెల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఫ్రాంక్ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు నగరంలో ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. బళ్లారి రోడ్డులోని హోటల్ సైన్ రీజెన్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీంతో ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, కస్టమర్ సర్వీస్ తదితర విభాగాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపర్చుకుని, తగిన శిక్షణ పొందితే ఈ రంగంలో మంచి కెరీర్‌ను నిర్మించుకోవచ్చని వివరించారు.
కౌన్సిలింగ్‌కు హాజరైన విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తులను బట్టి వారికి అనువైన కోర్సులపై నిపుణులు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేశారు. ఫ్రాంక్ఫిన్ అందిస్తున్న డిప్లొమా, అడ్వాన్స్‌డ్ కోర్సులు, శిక్షణ కాలపరిమితి, అంతర్జాతీయ గుర్తింపు వంటి అంశాలను సవివరంగా వివరించారు. అలాగే కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో లభించే ప్లేస్‌మెంట్ అవకాశాలు, గతంలో ఎంపికైన విద్యార్థుల విజయగాథలను కూడా ప్రతినిధులు వివరించారు. ఇటువంటి కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంలో, భవిష్యత్ కెరీర్‌పై స్పష్టత పొందడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.