seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 1:15 pm Digital Edition : SEEMA KIRANAM

కర్ణాటకలో ‘రోహిత్ వేముల చట్టం’..! కుల వివక్షను అరికట్టేందుకే.. | కర్నాటకలో రోహితవేముల చట్టం: క్యాంపస్‌లలో కుల వివక్షను నిర్మూలించేందుకు రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చట్టాన్ని ప్రకటించారు.

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘రోహిత్ వేముల బిల్లు’ ను అమలు చేస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ ఇన్ స్టిట్యూషన్స్ లో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ మేరకు సీఎం సిద్ధ రామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రీయ దళిత అధికార మంచ్ కన్వీనర్, గుజరాత్ లోని వడ్గామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, జిగ్నేష్ మేవానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

“ఇది @INCKarnataka, ముఖ్యమంత్రి @siddaramaiah ఆమోదం కోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక, సాహసోపేతమైన అడుగు! కుల నిర్మూలన జరగాలనే రోహిత్ కల, ఆత్మగౌరవం కోసం ఈ చట్టం ద్వారా కర్ణాటకకు న్యాయం జరుగుతుంది. అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇక 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే కుల వివాదం, దాడులను నిరోధించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఇక ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలవనుంది. ఈ చట్టం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుంది.

కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం క్యాంపస్‌లలో కుల వివక్షను నిర్మూలించే చట్టాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

ఇక రోహిత్ వేముల బిల్లుపై గతంలో కేబినెట్ సమావేశాల్లో చర్చలు జరిగాయి. కానీ ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు. అయితే 2025లో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. విద్యాసంస్థల్లో కుల సంబంధిత సమస్యలను ఈ చట్టాన్ని త్వరగా తీసుకురావాలని. ఈ కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు.

Source link