seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 7:05 am Digital Edition : SEEMA KIRANAM

కరీంనగర్ కార్పోరేషన్ మేయర్ పీఠం కోసం రసవత్తర రాజకీయం! | కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి క్యాంపు రాజకీయాలు. బండి సంజయ్ కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎంలను నిందించారు

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కరీంనగర్‌లో రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. కరీంనగర్ మున్సిపల్ క్యాప్ పైన బిజెపి జెండా ఎగరవేసిన వేళ తాజాగా ఆసక్తికరంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో మేయర్ పదవి కోసం బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కు అయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిని ఓడించేందుకు కుట్రలు లేవు, అన్ని పార్టీలు కలిసి ఇండిపెండెంట్ కార్పొరేటర్‌కు మేయర్ పదవిని ఆఫర్ చేసినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.

కరీంనగర్ క్యాంపు రాజకీయాలు

ఈ కార్పొరేటర్ తో నిన్న రాత్రి కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారని, బీఆర్ఎస్ నేతలు సైతం ఈ కార్పొరేటర్ తో రహస్య మంతనాలు జరిపారని బండి సంజయ్ చెబుతున్నారు. ఇండిపెండెంట్లు, ఏ ఐ ఎఫ్ బి తో, బిజెపి పొరేటర్లకు ఆఫర్లు సంకేతాలు ఇస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి క్యాంపు రాజకీయాలు, కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

కరీంనగర్ లో బీజేపీ బలం ఇదే

తనను మేయర్ గా బలపరిస్తే ఆర్థిక సహాయం చేస్తానంటూ ఆఫర్ ఇచ్చారని, ఈ కుట్రలను ఎండగడతామని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉండగా, 30 డివిజన్లలో బిజెపి విజయకేతనం ఎగురేసింది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు బిజెపికి నిన్ననే మద్దతు ఇచ్చారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బండి సంజయ్ ఓటుతో కలిపి బిజెపి బలం 33 కి చేరింది.

కరీంనగర్ లో ప్రత్యర్ధి పార్టీల సభ్యుల బలం ఇదే

అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నప్పటికీ, స్థానికంగా ఓటు లేకపోవడం వల్ల ఆయన మేయర్ ఎంపికకు ఓటు వేసే అర్హతను పొందలేదు. ఇక ప్రత్యర్థి పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ 14 స్థానాలను గెలుచుకోగా, బిఆర్ ఎస్ 9 స్థానాలను, ఎంఐఎం మూడు స్థానాలను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాలను, ఇండిపెండెంట్లు ఆరు స్థానాలను గెలుచుకున్నారు.

బీజేపీకి చెక్ పెట్టగలరా?

ఈ మొత్తం బలం 34 కాగా, వీరంతా మూకుమ్మడిగా కలిస్తే బిజెపికి చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే అవకాశం లేకపోవడంతో బిజెపికి ఎటువంటి ప్రమాదం లేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బండి సంజయ్ ని టార్గెట్ గా పెట్టుకున్న కరీంనగర్ ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలు మేయర్ ఎంపిక విషయంలో ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆంగ్ల సారాంశం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ క్యాంపు రాజకీయాలు అక్కడ బీజేపీ జెండా రెపరెపలాడుతున్నాయి . కరీంనగర్‌లో మేయర్ పదవి కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఏఐఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Source link