seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 3:16 pm Digital Edition : SEEMA KIRANAM

కమల్ హాసన్: ‘నీ పని చూసుకో’..! ట్రంప్ కు కమల్ హాసన్ ఘాటు కౌంటర్..! | ‘మైండ్ యువర్ ఓన్ బిజినెస్’: భారత సార్వభౌమాధికారంపై కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నేరుగా లేఖ

భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ వార్ భారత్ చమురు సంక్షోభం ఎదుర్కొంటోంది. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నా అంతర్గతంగా మొదలైన ఇబ్బందులు. ఈ నేపథ్యంలో ఇవాళ గ్యాస్ ధరల్ని సైతం కేంద్రం పెంచేసింది. దీంతో హార్ముజ్ జలసంధి వైపు నుంచి రవాణా కాకుండా ఆగిపోయిన చమురు ఉత్పత్తిలో రష్యా నుంచి తిరిగి భారత్ చమురు దిగుమతి చేసుకునేందుకు 30 రోజుల పాటు అనుమతించినట్లు తాజాగా ట్రంప్ (డోనాల్డ్ ట్రంప్) ప్రభుత్వం ట్వీట్ చేసింది.

భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతి ఇవ్వాలా అంటూ సాధారణ ప్రజలు సైతం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటిదేమీ లేదని కేంద్రం సర్దిచెబుతోంది. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తూ రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (కమల్ హాసన్) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ట్రంప్ ను తన పని తాను చూసుకోవాలని సూచించారు.

భారత సార్వభౌమాధికారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కమల్ హాసన్ నేరుగా లేఖ రాశారు

అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడికి ఓ లేఖ తరహాలో ట్వీట్ ప్రారంభించిన కమల్ హాసన్.. ప్రియమైన అధ్యక్షా,
భారత ప్రజలమైన మేము స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ దేశానికి చెందినవారం. మేము ఇకపై సుదూర విదేశీ తీరాల నుండి స్వీకరించాము. దయచేసి మీ స్వంత పనిని మీ శక్తి మేరకు చూసుకోండి. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం శాశ్వత ప్రపంచ శాంతికి ఏకైక పునాది. మీ దేశం మరియు ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సును మేము కోరుకుంటున్నాము. ఇట్లు కమల్ హాసన్ , గర్వించదగిన భారతీయ పౌరుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు అంటూ ట్వీట్ చేశారు.

Source link