ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-కొరివి జయకుమార్
ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిశాయి. కాగా ఇవాళ భారత్‌లో నెలవంక కనిపించింది. ఈ దేశంలో ముస్లింలు శనివారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగ జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ఆ పోస్టులో పవిత్ర రంజాన్ ( రంజాన్ ) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేయడం, మంచి మార్గంలో నడవడం, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశమని తెలిపారు.

కాకుండా పేదలకు దానం చేయడం వల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుందని కొనియాడారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభిస్తాయి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…. ఈద్ ముబారక్” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 21న సాధారణ సెలవు కూడా ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకారం జారీ చేసిన సాధారణ సెలవుల జాబితా 20వ తేదీన రంజాన్ సెలవుగా నిర్ణయించారు. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ రంజాన్ ) పండగ శనివారం వస్తుందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ నుంచి ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ 21వ తేదీ సాధారణ సెలవుగా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

