ఓటరు జాబితా ప్రక్షాళనపై అప్రమత్తంగా ఉండాలి
ప్రతి ఓటునూ జాగ్రత్తగా పరిశీలించాలి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వెల్దుర్తి, జూన్ 02 (సీమకిరణం న్యూస్): ఓటరు జాబితా ప్రక్షాళనపై అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తెలిపారు. మంగళవారం వెల్దుర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మండలానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జరుగుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ) కార్యక్రమాన్ని అత్యంత కీలకంగా తీసుకోవాలని పత్తికొండ మాజీ...