ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సహకారంతో ఐజీ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం!
భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్
రోడ్డు పనులతో హర్షం వ్యక్తం చేస్తున్న ఐజీ నగర్ కాలనీవాసులు
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 09, ఎస్.కె. నజీర్, ఎడిటర్ (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఐజీ నగర్ 14వ వార్డులో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సహాయ సహకారాలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత , మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రోడ్డు నిర్మాణ పనులకు లాంఛనంగా భూమిపూజ చేసి ప్రారంభించారు. గత కొంతకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు తమ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల స్థానికులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. సీసీ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్‌కు, పనులు ప్రారంభించిన మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్‌కు కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.