seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 10:51 am Digital Edition : SEEMA KIRANAM

ఏసీబీ వలలో చిక్కిన అటవీ శాఖ అధికారులు

ఏసీబీ వలలో చిక్కిన అటవీ శాఖ అధికారులు!

 

భద్రాది జిల్లా, మే 07, (సీమకిరణం న్యూస్):

 

భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి వో , సుజాత, చర్ల ఇన్చార్జి డిఆర్వో, కృష్ణయ్య, గురువారం ఏసీబీ వలకు చిక్కా రు. దీంతో భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుండి రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యల ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలోఈ దాడు లు నిర్వహించారు. తెలిసిన సమాచారం ప్రకారం… భద్రాది జిల్లా,చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతం లో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఆపనుల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని చెట్లను తొలగించారు. దానిపై కేసు నమోదు చేయ కుండా ఉండేందుకు భద్రాచలం ఎఫ్ డివో సుజాత, 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం బాధితుడీ నుండి మొదటి విడుత గా 3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ బీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు లు ఆమెతో పాటు చర్ల అటవీ శాఖ ఇన్చార్జి అధికారి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు.