seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 10:16 am Digital Edition : SEEMA KIRANAM

ఏలియన్స్ ఉన్నారా?: ఒబామా సెన్సేషనల్ కామెంట్స్ | ఏలియన్స్‌పై బరాక్ ఒబామా, అవి నిజమే, కానీ నేను వాటిని చూడలేదు, బ్రియాన్ టైలర్ కోహెన్ పోడ్‌కాస్ట్, వివరాలు

అంతర్జాతీయ

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

విశ్వంలో మనమే కాకుండా ఇతర జీవులు(ఏలియన్స్) ఉన్నాయా? అనే ప్రశ్నకు దశాబ్దాలుగా సమాధానం దొరకడం లేదు. అయితే తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘బ్రియాన్ టైలర్ కోహెన్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఒబామా.. ఏలియన్స్ ఉనికిపై ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.

ఏలియన్స్ ఉన్నారు.. కానీ!
ఫిబ్రవరి 14, 2026న విడుదలైన ఈ ప్యాడ్‌కాస్ట్‌లో హోస్ట్ కోహెన్.. “నిజంగా ఏలియన్స్ ఉన్నారా?” అని ప్రశ్నించగా, ఒబామా నవ్వుతూ సమాధానమిచ్చారు. “ఏలియన్స్ అనేవి వాస్తవమే, కానీ నేను స్వయంగా చూడలేదు. అలాగే అమెరికాలోని అత్యంత రహస్య ప్రాంతమైన ‘ఏరియా 51’లో వారిని దాచిపెట్టారనే ప్రచారంలో నిజం లేదు. అక్కడ ఎలాంటి గుప్త రహస్యాలు లేవు” అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు.

గ్రహాంతరవాసులపై బరాక్ ఒబామా వారు నిజమే కానీ నేను వాటిని చూడలేదు బ్రియాన్ టైలర్ కోహెన్ పోడ్‌కాస్ట్

జిమ్మీ కిమ్మెల్ షో వీడియో వెనుక అసలు నిజం
గతంలో ఒబామా ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ షోలో మాట్లాడుతూ.. “ఏలియన్స్ మనల్ని నియంత్రిస్తున్నారు, నేను రహస్యాలు వెల్లడిస్తే వారు ఊరుకోరు” అని. ఆ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై ఒబామాని స్పందిస్తూ.. అవి కేవలం తమాషాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే, వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు.

UFOల మిస్టరీపై గతంలో ఏమన్నారంటే?
2021లో కూడా ఒబామా అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనామెనా (UAP/UFO) గురించి మాట్లాడారు. ఆకాశంలో వింతగా మనకు వస్తువుల వీడియోలు, రికార్డులు ఉన్నాయని, అవి ఎలా అంత వేగంగా ప్రయాణిస్తున్నాయో అర్థం కాదని ఆయన అంగీకరించారు. అయితే అవి ఇతర దేశాల డ్రోన్లు కావచ్చు లేదా వాతావరణ మార్పుల వల్ల కలిగే దృశ్యాలు కాయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ వ్యూహమా? లేక నిజమా?
ఒబామా ఈ కామెంట్స్ చేయడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చని విశ్లేషకులు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 2026లో ఏలియన్ల గురించి ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒబామా ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒబామా ఏలియన్ల ఉనికిని పూర్తిగా కొట్టిపారేయకుండా, ఏరియా 51 వంటి కుట్ర సిద్ధాంతాలను మాత్రం తిరస్కరించారు.

ఆంగ్ల సారాంశం

మాజీ US అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రియాన్ టైలర్ కోహెన్ యొక్క పోడ్‌కాస్ట్‌లో ఏలియన్స్ మరియు UFOల గురించి చర్చించారు. అతను ఏరియా 51 అపోహలను తొలగించాడు మరియు జిమ్మీ కిమ్మెల్ లైవ్ నుండి అతని గత వైరల్ జోకులను స్పష్టం చేశాడు.

Source link