seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 7:33 am Digital Edition : SEEMA KIRANAM

ఏపీ బడ్జెట్ 2026-27 ఉద్యోగులకు దక్కిందేంటి..!! | బడ్జెట్ 2026: ఆర్థిక మంత్రి పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో బకాయిల క్లియరెన్స్‌పై ఉద్యోగులకు హామీ ఇచ్చారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

AP బడ్జెట్ 2026-27: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ 3.32 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ సిక్స్ పథకాలలో అమలు కోసం నిధులు కేటాయించబడ్డాయి. ఇక, గత ప్రభుత్వంలో ఆర్దిక లోపాలు.. వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్దిక మంత్రి పయ్యావుల తన ప్రసంగంలో వివరించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను చెప్పారు. ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో చూసారు. మరి.. ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు దక్కిందేంటి…ఆర్దిక మంత్రి ఏం చెప్పారు…

ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్దిక నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించారు. ఏపీలో గత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పారు. తాము అధికారం లోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభ లో వివరించారు. ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశ పెట్టటం కూడా కష్టమేనని. కాగా, ఈ రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా.. పెండింగ్ బకాయిలు.. అదే విధంగా రావాల్సిన డీఏల పైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. సంక్రాంతి వేళ ప్రభుత్వం ఒక డీఏ బకాయిలను విడుదల చేసింది. దీంతో… పీఆర్సీ ప్రకటనతో సహా ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతో ఉద్యోగులు వేచి చూస్తున్నారు. జగన్ 2024 ఎన్నికల ముందు పీఆర్సీ కమీషన్. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత పీఆర్సీ కూటమి కమిష నర్ రాజీనామా చేసారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు.

బడ్జెట్-2026-ఆర్థిక-మంత్రి-హామీ-ఉద్యోగులు-ఓవర్-క్లియరెన్స్-బకాయిలు-కూడా-ప్రస్తావన-సిపిఎస్-ఇష్యూ-ఇన్

పీఆర్సీ ప్రస్తావన లేకుండానే

ఇక.. ఈ బడ్జెట్ లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు నిరీక్షించినా ఫలితం కనిపించలేదు. బడ్జెట్ లో ఆర్దిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగా ఆర్దిక వ్యవస్థను సరిదిద్దుతున్నామనే అంశం వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. డీఎస్సీ, ఇతర ఉద్యోగాల కల్పన గురించి వివరించారు. ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్ విధానం సక్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపు ప్రారంభించామని. రూ 1,100 కోట్ల బకాయిలు చెల్లించామని వివరించారు. సీపీఎస్ ఉద్యోగులకు వారి PRAN ఖాతాలో ప్రభుత్వ వాటాతో కలిపి అదనపు కంట్రిబ్యూషన్ జమ చేస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ఎప్పుడైనా పిల్లల సంరక్షణ సెలవులు పొందే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రమాదవశాత్తు మరణ భీమా కల్పించేలా బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఉద్యోగం. అనేక కేటగిరీల్లో 30,607 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అయితే, పీఆర్సీ గురించి ప్రస్తావన చేస్తారని భావించిన ఉద్యోగులకు నిరాశ తప్పలేదు.

ఆంగ్ల సారాంశం

బడ్జెట్ 2026: AP ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ఉద్యోగుల ప్రాధాన్యతను ప్రస్తావించింది, బకాయిలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది, CPS సమస్యలపై దృష్టి పెట్టింది

Source link