seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 12:17 pm Digital Edition : SEEMA KIRANAM

ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు కర్నూలు రేంజ్ క్రీడాకారుల సన్నద్ధత

ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు కర్నూలు రేంజ్ క్రీడాకారుల సన్నద్ధత

 

పోలీసు అధికారులు, సిబ్బందికి స్పోర్ట్స్ కిట్లు అందజేసిన డీఐజీ కోయ ప్రవీణ్

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 29 (సీమకిరణం న్యూస్):

 

ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గుంటూరులో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ నుంచి పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ పోలీసు క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి కర్నూలు రేంజ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని డీఐజీ తెలిపారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కర్నూలు రేంజ్‌కు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు చంద్రబాబు నాయుడు, తేజామూర్తి, తిక్కస్వామి, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికైన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.