ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనేక ప్రతిపాదనలకు ఆమోదం. అమరావతి లో నిర్మాణాలు.. భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. APSP లోని 2, 3, 5, 6, 9, 11, 14, 16వ బెటాలియన్లలో పనిచేస్తున్న 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌పెక్టర్లుగా స్థాయిని పెంచడానికి మంత్రి మండలి ఆమోదం లభిస్తుంది. ఇరిగేషన్.. రెవిన్యూ అంశాల పైన చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉపాధి కల్పనకు సంబంధించి కొత్త పథకానికి ఆమోదం తెలిపింది.
ఏపీ మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులు సరైన సమయంలో అమలు చేయడానికి, పారిశ్రామికవేత్తలు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి రుణ సహాయం పొందడం, రాష్ట్రంలో వ్యాపారం చేయడం మరింత సులువు చేయడానికి, పెట్టుబడులు వేగవంతం చేయడానికి మరియు ఉపాధి అవకాశాలను పెంచడానికి అవసరమైన చర్యలకు మంత్రి మండలి ఆమోదం తెలియజేస్తుంది. ఎలాంటి అభ్యంతరాలు లేని 66,157 ఎకరాల ఏపీఐఐసీ భూములను సెక్షన్ 22- నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (AP-CMEGP) పేరుతో ప్రతిపాదిత పథకానికి ఆమోదం. ఈ పథకం కింద దాదాపు 3,500 మంది మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌లకు వారి తయారీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందనుంది.

కీలక ప్రతిపాదనలకు ఆమోదం
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రెటేరియట్ & HoD కార్యాలయాలు (GAD టవర్, టవర్లు 3 & 4 మరియు టవర్లు 1 & 2)లో హై సైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్‌లు, ఫైర్ అలారం & పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు అడ్మినిస్ట్రేషన్ వర్కుల MEP1కు రూ.28 కోట్ల ఆమోదం. అమరావతిలోని నీరుకొండ (V)లో EPC కాంట్రాక్ట్‌లో ‘తెలుగు కల్చర్ సెంటర్’ పనులకు GST మరియు ఇతర నిబంధనలతో కలిపి రూ.119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం నిర్మాణ పద్ధతి. ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ శక్తి కింద ‘సఖి నివాస్ పథకం’ (క్రెష్ సదుపాయంతో కూడిన వర్కింగ్ విమెన్ హాస్టళ్ళు) అమలు చేయడానికి ఆమోదం ప్రదర్శించబడుతుంది.
ఆంగ్ల సారాంశం
అమరావతి నిర్మాణాల్లో కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం, భూ కేటాయింపులకు సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం