seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 8:50 am Digital Edition : SEEMA KIRANAM

ఏపీ అసెంబ్లీ: మళ్లీ జగన్ తో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఈక్వేషన్ మారుతోందా? | వైఎస్సార్‌సీపీ సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు చాలా కాలం తర్వాత ఏపీ అసెంబ్లీలో జగన్‌ను కలిశారు.

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీలో గతంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాత నిర్ణయాలను సమీక్షిస్తారా ? ఇవాళ అసెంబ్లీకి జగన్ తో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు (ysrcp mlcs) కనిపించి చర్చకు తెరలేపారు.

గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎంపికై, ఫామ్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో ఇరుక్కుని, జైలు జీవితం కూడా అనుభవించిన అనంతబాబుపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. అప్పట్లో అధికారంలో ఉన్న జగన్.. విపక్షాల విమర్శలకు తోడు, సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఈ వేటు వేశారు. అయితే అధికారికంగా వేటు పడినా అనంతబాబు మాత్రం వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఇవాళ జగన్ తో కలిసి ఆయన అసెంబ్లీలో నిరసనల్లో కూడా ఉన్నారు.

వైఎస్సార్సీపీ సస్పెండ్ అయిన ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్‌ను కలిసిన అనంతబాబు

అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్య వాణిని వదిలేసి ప్రియురాలు దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్న కుటుంబ విభేదాలు రోడ్డుకెక్కాయి. వాణి, తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి చేసిన రచ్చ తర్వాత ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తనపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరుల ఒత్తిడితోనే పార్టీ వేటు వేసిందని ఆయన కూడా పలుమార్లు చెప్పుకున్నారు. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా జగన్ ను అసెంబ్లీకి వచ్చి కలిశారు. అసెంబ్లీ నుంచి వైసీపీ ప్రజాప్రతినిధులు బాయ్ కాట్ చేస్తున్న జగన్ తో కలిసి ఏదో మాట్లాడుతూ ఆయన బయటికి వస్తుండటం కనిపించింది. ఈ రెండు పరిణామాలతో వీరిద్దరినీ తిరిగి పార్టీలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు జగన్ సిద్దమవుతున్నారన్న చర్చ.

Source link