ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పైన పడిపోయింది. మన భారతదేశంలోని అనేక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పైన స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం పెరిగింది.
ఏపీలో గ్యాస్ కొరత, బాగా పెరిగిన ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం
ఈ విద్యుత్ వినియోగానికి యుద్ధమే కారణమని సూచిస్తుంది. అసలు యుద్ధానికి విద్యుత్ వినియోగానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుతం గ్యాస్ కొరత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్యాస్ కొరత ప్రధానంగా కనిపిస్తుంది. దీనితో ఏపీలో ప్రజలు వంట గ్యాస్ కు బదులుగా ఇండక్షన్ స్టవ్ లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకాన్ని బాగా పెంచారు.

బాగా నమోదవుతున్న విద్యుత్ వినియోగం
దీనివల్ల విద్యుత్ వినియోగం బాగా పెరిగింది అసలే ఎండాకాలం కావడంతో ఇప్పటికే కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇక గ్యాస్ కొరత, చాలా గ్యాస్ పైన కాకుండా ఇనక్షన్ స్టవ్ ల పైన, ఎలక్ట్రిక్ కుక్కర్ల లోను వంట ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో మరింత విద్యుత్ డిమాండ్ పెరిగింది. మార్చి 7వతేదీన రికార్డు స్థాయిలో 274. 6మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఏపీలో నమోదైంది.
విద్యుత్ వినియోగం పెరగడానికి కారణం
గత సంవత్సరంతో ఈసారి విద్యుత్ వినియోగం 915 శాతం అధికంగా ఉంది. మార్చి 12,13, 14తేదీలలో కూడా వరుసగా సుమారు 272 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి గ్యాస్ కొరత కారణంగా ఉంది. ఈ గ్యాస్ కొరతకు యుద్ధం కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగానే ఏపీలో విద్యుత్ అధిక వినియోగానికి ఒకరకంగా పరోక్షంగా యుద్ధం కారణంగా కనిపిస్తుంది.
మే నాటికి బాగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా
ఏపీలో ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మే నాటికి ఏపీలో విద్యుత్ వినియోగం 280 మిలియన్ల యూనిట్లకు చేరే విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి సగం కూడా పూర్తికాకముందే ఇంత ఎక్కువగా విద్యుత్ వినియోగం చేయడం ఇదే మొదటిసారి.
యుద్ధంతో అన్ని రంగాలు ప్రభావితం
అదే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగితే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అన్ని రంగాలు ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళన కనిపిస్తుంది. మానవ జీవనం భారంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

