Monday, March 9, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! |...

ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! | తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు..ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. నంద్యాల జిల్లాలో నేడు క్యూఆర్ కోడ్ తో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతుల భూములపై ​​పూర్తి హక్కులు కల్పించడంతోపాటు, అవినీతి రహితంగా ఉండేవిధంగా పట్టాల పంపిణీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

ఏపీలో భూ రికార్డుల నిర్వహణలో సమూల సంస్కరణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎటువంటి రెవిన్యూ సమస్యలు లేకుండా పకడ్బందీగా పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణలో సమూల సంస్కరణలు చేపడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్త బురుజు గ్రామంలో జరిగిన గ్రామ సభలో చంద్రబాబు రైతులకు స్వయంగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.

ఏపీలో రైతులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసింది. రైతులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, ఆ హామీ మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు.

ఫోర్జరీలకు అవకాశం లేకుండా భూ రికార్డులు

భూ రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పక్కాగా, పారదర్శకంగా పట్టాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో నెలకొన్న గందరగోళానికి స్వస్తి చెబుతూ కొత్త క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టామని తెలిపారు. అధునాతన సాంకేతికత వల్ల రికార్డులు భద్రంగా ఉంటాయని, ఫోర్జరీలకు ఎటువంటి అవకాశం ఉండదని చంద్రబాబు.

అవినీతి లేకుండా పట్టాలు అందిస్తాం

ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా పట్టాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉన్న భూ వివాదాలు, రెవిన్యూ సమస్యలు అన్నింటిని పరిష్కరించిన తర్వాతనే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో లోపాలు

గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో జరిగిన లోపాల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చంద్రబాబు. ఇకపైన భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular