seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 5:08 pm Digital Edition : SEEMA KIRANAM

ఏపీలో టీవీ సౌండ్ తగ్గించమంటే భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య! | నేరం: మంగళగిరి టిడ్కో హౌసింగ్‌లో టీవీ సౌండ్ తగ్గింపు కోసం ఇంటి గొడవలో భర్తను హతమార్చిన భార్య

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మంగళగిరిలోని టిడ్కో (TIDCO) ఇళ్ల సముదాయంలో గురువారం రాత్రి విషాదకర ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న కుటుంబ వివాదం క్షణాల్లోనే ఘర్షణగా మారి, ఒక ప్రాణాన్ని బలిగొన్న దుర్ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేసింది.

భార్యాభర్తల మధ్య గొడవ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో ఇళ్ళ సముదాయంలో ఓ ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భార్య భర్తను కత్తితో పొడిచే హతమార్చే దాకా వెళ్ళింది. టీవీ సౌండ్ తగ్గించాలని భర్త అహ్మద్ కోరడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. సాధారణంగా చిన్నగా మొదలైన వారిద్దరి గొడవ క్రమంగా తీవ్రతరమైంది.

మంగళగిరి టిడ్కో హౌసింగ్‌లో టీవీ సౌండ్ తగ్గించడం కోసం ఇంట్లో గొడవలో భర్తను హత్య చేసిన నేరం భార్య

కత్తితో భర్తను పొడిచిన భార్య

దీంతో ఆవేశానికి లోనైన భార్య క్రాంతి కిచెన్‌లో ఉన్న కత్తిని తీసుకొచ్చి అహమ్మద్ పైన దాడి చేసింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన అహ్మద్‌ను సమీప ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా అతని ప్రాణాలను వైద్యులు నిలువరించలేకపోయారు. అప్పటికే అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రేమ వివాహం.. ఆపై మనస్పర్ధలు

సంవత్సరం క్రితం ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్న సమాచారం. మొదట్లో సంతోషంగా గడిపిన ఈ జంట ఇటీవల కాలంలో చిన్న చిన్న విభేదాలతో తరచూ గొడవ పడుతున్నారు అని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవలకు పెద్ద కారణాలు లేవని, పెద్దగా కుటుంబ కలహాలు కూడా బయటకు రాలేదని అంటున్నారు.

ఘటన వెనుక కారణాలేంటి? పోలీసు దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. క్షణికావేశంతో భార్య ఈ ఘాతుకానికి కారణమైందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

భర్తను చంపిన భార్య జైలు పాలు

ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు ప్రాణాలు తీసేదాకా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఏదైనప్పటికీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి కానీ దాడులకు వెళితే సమస్య పరిష్కారం కాకపోగా జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది క్షణికావేశంలో భర్తను చంపిన భార్య తన భవిష్యత్తును కోల్పోయిన జైలు పాలవుతోంది.

ఆంగ్ల సారాంశం

in a crime wife killed husband in ap.గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్‌లో టీవీ వాల్యూమ్‌పై వివాదం తలెత్తడంతో ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Source link