seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:24 am Digital Edition : SEEMA KIRANAM

ఏపీలో కొత్తగా ఎకనామిక్ రీజియన్లు – ఏ రీజియన్‌లో ఏ జిల్లా, అక్కడ ఇక…!! | AP ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది, బడ్జెట్ 2026లో సమ్మిళిత వృద్ధి కోసం ఆర్థిక ప్రాంతాలను ప్రకటించింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో పాలనలో ముందుకు వెళ్తోంది. ప్రతీ జిల్లాలో వృద్ధిని సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గతంలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన విధంగా బడ్జెట్ లో తాజాగా కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించడంతో పాటుగా వృద్ధిలో అన్ని జిల్లాల భాగస్వామ్యం ఉండేలా కొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందు కోసం కొత్త ఆర్డిక మండళ్లను ఏర్పాటు చేస్తోంది. ఏ రీజియన్ ఏ జిల్లా వస్తుందో ప్రకటించింది. ఇక.. అక్కడ కొత్త నిర్ణయాలు అమలు కానున్నాయి.

ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విజన్ స్వర్ణాంధ్ర 2047 అమలు కోసం ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతిపాదనలు అందజేశాయి మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతీ జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ అభివృద్ధి ప్రక్రియను అనుసరించిందని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజిన్‌గా గుర్తించిందని చెప్పారు. నీతి ఆయోగ్‌తో కలిసి విశాఖపట్టణం ఎకనమిక్ రీజియన్ (వీఆర్)కి ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేశామని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పొలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్టణం ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఏడు గ్రోత్ ఇంజిన్లు ఏర్పాటు. కాగా, వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ప్రాథమిక సౌకర్యాలు, పట్టణీకరణ, వ్యవసాయంలో 41హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి.

ap-govt-planning-to-develop-all-the-districts-aounces-econounces-economic-Regions-for-inclusive- growth-in-bu

జిల్లాల వారిగా ప్రభుత్వం ప్రణాలికలు

అందులో భాగంగా అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల నుంచి సమకూర్చుకుంటామని పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకాదు.. మెట్రో రైలు ప్రాజెక్టులు సహా వీఆర్‌కి సంబంధించి సుమారు 28వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా వీఈఆర్ తరహాలోనే అమరావతి ఎకనామిక్ రీజియన్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ రీజియన్ పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలు రానున్నాయి. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు.. గ్రోత్ ఇంజిన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్దతుల్లో సామాజిక, ఆర్థిక అధ్యయనం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల తెలిపారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల్లో 200పైగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్స్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.

ఆంగ్ల సారాంశం

కొత్త ఆర్థిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు, గ్రోత్ ఇంజిన్‌లుగా అభివృద్ధి చేసేందుకు జిల్లాలను ఖరారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది

Source link