seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 1:30 pm Digital Edition : SEEMA KIRANAM

ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! | AP ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఉద్యోగుల కోసం డిజిటల్-మాత్రమే చెల్లింపులకు మార్చింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీలో ఉద్యోగులకు మెడికల్ బిల్లుల రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం (ap govt) కీలక మార్పు చేసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందని సందర్భాల్లో ముందుగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సొంత డబ్బులు పెట్టుకుని, ఆ తర్వాత ప్రభుత్వానికి మెడికల్ బిల్లులు రీయింబర్స్ మెంట్ కోసం పెట్టుకుంటారు. వీటి చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు కీలక మార్పు చేసింది.

ఉద్యోగుల మెడికల్ బిల్లుల రీయింబర్స్ మెంట్ (ap govt)

ఉద్యోగుల వైద్యుల మెడికల్ రీ-ఎంబర్స్ మెంట్ విధానంలో కూటమి ప్రభుత్వం నూతన సంస్కరణలు తెస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉండేందుకు, వారికి వ్యయప్రయాసలు లేకుండా వీలుగా పేపర్ లెస్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బిల్లుల స్వీకరణ, పరిశీలన, బిల్లుల చెల్లింపు, చెల్లింపులు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు నూతన సాఫ్ట్‌వేర్ ఏపీ సెంటర్ ఫర్ పైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్) ద్వారా తయారు చేస్తోంది.

AP ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఉద్యోగుల కోసం డిజిటల్-మాత్రమే చెల్లింపులకు మార్చింది

ప్రభుత్వం కసరత్తు

కొత్త సంస్కరణలను త్వరగా అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోంది. హాస్పటల్ నిర్వహణ, చర్యలను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయడానికి ప్రాథమికంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు 5,55,988 మంది, పెన్షనర్లు 2,32,764 మంది ఉన్నారు. వీరిపై పేర్కొన్న కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 24,33,306 మంది ‘ఉద్యోగుల ఆరోగ్య బీమా’ (ఈహెచ్‌ఎస్) పరిధిలో ఉన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రుల్లో నగదురహిత విధానంలో చికిత్స పొందిన వారు కాకుండా. మెడికల్ రీ-ఎంబర్స్ మెంట్ విధానం (సొంత ఖర్చు) లో చికిత్స పొందిన వారి బిల్లులు ట్రస్ట్ కార్యాలయానికి అందుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.232 కోట్ల విలువైన బిల్లులను ఇచ్చారు. ఈఎస్హెచ్ ద్వారా నగదు రహిత విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ట్రస్ట్‌ అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వీలుంది. ఇవి కాకుండా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అదనంగా గుర్తించిన మరో 600 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స పొందిన వారు వాటిని తిరిగి పొందేందుకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ విధానంలో బిల్లుల వారి ‘డీడీఓ లద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు.

ప్రస్తుత విధానం

చికిత్స పొందిన తర్వాత ఉద్యోగుల ఆసుపత్రుల నుంచి ఆరోగ్య వివరాలు, పొందిన, రిపోర్టులు, బిల్లుల చికిత్సలను సదరు శాఖల ‘డీడీఓ’లకు సమర్పిస్తున్నారు. అక్కడి నుంచి ట్రస్ట్ కార్యాలయానికి బిల్లులు వెళ్తున్నాయి. ఇక్కడి వైద్యుల పరిశీలన అనంతరం ఇచ్చిన బిల్లులను మళ్లీ సంబంధిత ‘డీడీఓ’లకు పంపుతున్నారు. డీడీఓ మళ్లీ హెచ్ ఓడి కార్యాలయానికి పరిపాలనాపరమైన ఆమోదం కోసం పంపుతున్నారు. వివరాలను పరిశీలించిన అనంతరం హెచ్ ఓడి పంపిన పరిపాలన ఆమోదం మేరకు డీడీఓ వివరాలను బిల్లుల చెల్లింపు కోసం సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. డీడీఓ నుంచి ట్రస్ట్‌ వరకు ఆన్‌లైన్‌లో వివరాలు పంపుతున్నా, ఆ తర్వాత ప్రాసెస్ ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నందున బిల్లుల చెల్లింపుల విష‌యంలో ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా పెన్షనర్లు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ విధానం పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు.

AP ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఉద్యోగుల కోసం డిజిటల్-మాత్రమే చెల్లింపులకు మార్చింది

ఇకపై చెల్లింపుల ప్రక్రియ ఇలా..

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ ఈ నెల 18న మెడికల్ రీ-ఎంబర్స్ మెంట్ విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నందున ప్రత్యేక ఆన్‌లైన్ వెర్షన్ డిజైన్‌ని సిఏఎఫ్ఏఎస్ఎస్ కు వర్క్ ఆర్డర్ పంపారు.రాబోతున్న సంస్కరణలు, చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఉద్యోగుల ఆరోగ్యం, చికిత్స బిల్లు వివరాలు నేరుగా ట్రస్ట్ కార్యాలయానికి వెళ్తాయి. ఇక్కడ వైద్యుల పరిశీలన అనంతరం బిల్లుల వివరాలు సంబంధిత ఉద్యోగి హెచ్‌ఓడి కార్యాలయానికి పరిపాలన ఆమోదం కోసం వెళ్తాయి. అనుమతి ఉత్తర్వులు ఇక్కడి నుంచి డీడీఓ కార్యాలయానికి వెళ్తాయి. డీడీఓ కార్యాలయానికి సంబంధించిన వివరాలు అందిన వెంటనే బిల్లులను చెల్లింపుల కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. పైన పేర్కొన్న ప్రతి ప్రక్రియ కాగిత రహిత విధానంలో ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది. జిల్లా స్థాయిలో రూ.50,000 లోపు అసుపత్రుల బిల్లుల చెల్లింపు ప్రస్తుతం మ్యానువల్ విధానంలో జరుగుతోంది. దీనిని కూడా పూర్తిగా ఆన్‌లైన్‌కి తీసుకొస్తారు.

Source link