seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 7:20 pm Digital Edition : SEEMA KIRANAM

ఏపీఎస్ఆర్టీసీ 14 పుణ్యక్షేత్రాల దర్శనం: హంపీ, గోకర్ణ | APSRTC 9 రోజుల సూపర్ లగ్జరీ బస్ ఆధ్యాత్మిక ప్యాకేజీలను కర్ణాటక-మైసూర్ ట్రిప్‌కు మిస్ అవ్వకండి మరియు ఇప్పుడే బుక్ చేసుకోండి:

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులు వస్తున్నాయి. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.

తాజాగా ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. కర్ణాటక- మైసూరు యాత్ర స్పెషల్ ఇది. ఈ పర్యాటక ప్యాకేజీకి వచ్చింది. ఈ నెల 5న కర్ణాటక- మైసూరు యాత్రకు రాజమండ్రి నుంచి బస్సులు బయలుదేరి వెళ్లనున్నాయి. వీటికోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను వినియోగించనుంది ఏపీఎస్ఆర్టీసీ. మొత్తం తొమ్మిదిరోజుల పాటు సాగే యాత్ర ఇది. 14 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

APSRTC 9 రోజుల సూపర్ లగ్జరీ బస్సు కర్నాటక-మైసూర్ ట్రిప్‌కు ఆధ్యాత్మిక ప్యాకేజీలు మిస్ అవ్వకండి మరియు ఇప్పుడే బుక్ చేసుకోండి

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనంతో ఈ టూర్ మొదలవుతుంది. రాజమండ్రి నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు మొదట్లో శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ దర్శనానంతరం మహానంది, మంత్రాలయానికి చేరుకుంటుంది. అక్కడి కర్ణాటకలో ప్రవేశిస్తుంది. చరిత్రాత్మక హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూర్ ఇందులో ఉన్నాయి.

ఈ యాత్రకు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ 11,500 రూపాయలు. యాత్రలో అన్ని రోజులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తారు. భోజన సదుపాయంతో కలిపి ఈ ఛార్జీని నిర్ధారించారు. ఎక్కడైనా విశ్రాంతి గదులు తీసుకుంటే దాని కయ్యే అదనపు ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుంది.

1. శ్రీశైలం- భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం

2. మంత్రాలయం- రాఘవేంద్రస్వామి వారి మఠం

3. హంపీ- విరూపాక్ష ఆలయం

4. గోకర్ణ- ఆత్మలింగం

5. ఇడిగంజి- మహాగణపతి దేవస్థానం

6. మురుడేశ్వర్- మురుడేశ్వరస్వామి ఆలయం

7. కొల్లూరు- మూకాంబికా అమ్మవారి దేవస్థానం

8. ఉడిపి- శ్రీకృష్ణదేవాలయం

9. శృంగేరి- శారదాంబ అమ్మవారి ఆలయం, శక్తిపీఠం

10, హొరనాడు- అన్నపూర్ణేశ్వరిదేవి ఆలయం

11. ధర్మస్థల- శ్రీ మంజునాథస్వామి దేవాలయం

12. శ్రీరంగపట్నం- చరిత్రాత్మక శ్రీరంగనాథుడి ఆలయం

13. మైసూర్- చాముండేశ్వరిదేవి శక్తిపీఠం

14. కమ్మసంద్ర- కోటిలింగాల ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు.

ఆంగ్ల సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 15 దేవాలయాలతో 9 రోజుల పాటు కర్ణాటక-మైసూర్‌గా సూపర్ లగ్జరీ బస్సులో ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీలను అమలు చేస్తుంది. తాజాగా మరో రెండు ప్యాకేజీలను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ.

Source link