భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
ప్రస్తుత కాలంలో ఎవరి పనుల్లో వారు ఉంటున్నారు. మనసు విప్పి మాట్లాడేవారు. అది కూడా ముంబై అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. సరిగ్గా ఇదే తన బిజినెస్ మోడల్‌గా మార్చుకున్నాడు పృథ్వీరాజ్ బోహ్రా అనే ఓ వ్యక్తి. ముంబై బీచ్ ఒడ్డున తన వినూత్నమైన వ్యాపారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీచ్ ఒడ్డున ఎదుటివారి బాధలను ఓపికగా వింటూ అందుకు డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. కేవలం ఇతరుల బాధలను విని డబ్బులు వసూలు చేసే విధానం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏడవడానికి కూడా రేటు పెట్టేశాడు బాబోయ్..
పృథ్వీరాజ్ బోహ్రా తన వద్దకు వచ్చేవారి సమస్య తీవ్రతలను బట్టి మూడు రకాల ప్యాకేజీలను ప్రకటించారు. చిన్న సమస్యలైతే వారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తున్నాడు. కాస్త సీరియస్ విషయాలైతే రూ.500.. లేదంటే కలిసి కూర్చుని ఏడవాలంటే రూ. 1000లు వసూలు చేస్తున్నాడు. ఎవరైనా తమ బాధను పంచుకోవాలనుకంటే నేను వింటానని హిందీలో రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని బీచ్‌లో కనిపిస్తున్నాడు ఈ పృథ్వీరాజ్ బోహ్రా. అతడిని నిజంగానే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుని డబ్బులు ఇస్తారా అని అడగగా.. “అవును చాలా మంది వస్తున్నారు” అని పృథ్వీరాజ్ సమాధానం చెప్పడం విశేషం.

నేటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాల్లో విడిపోయారు.” “బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం పోయి, వారి బలహీనతపై డబ్బులు సంపాదించడం ఏంటి? ఇది సరైన పద్దతి కాదు” అని మరికొందరు మండిపడుతున్నారు.ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ నెటిజన్ నివేదించారు.
🚨 ముంబై బీచ్ వైరల్: మనిషి సమస్యలను వినడానికి ప్రజలను వసూలు చేస్తాడు.
రిపోర్టర్: ప్రజలు వస్తారా? 🤯
మనిషి : “అవును, చిన్న సమస్యలకు ₹250. పెద్ద చింతలకు ₹500, కలిసి ఏడవాలంటే ₹1,000. ప్రజల సమస్యలు వినడానికి నేను ఇక్కడ ఉన్నాను” 😳pic.twitter.com/cTXeKgzLzl
— న్యూస్ ఆల్జీబ్రా (@NewsAlgebraIND) మార్చి 20, 2026
మానసిక ఆరోగ్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిఫైడ్ కౌన్సిలర్‌లు కాకుండా ఇలాంటి ఇచ్చే సలహాలు లేదా పద్ధతులు కొన్నిసార్లు సమస్యను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ‘లిజనింగ్ బిజినెస్’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.

