seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 1:40 am Digital Edition : SEEMA KIRANAM

ఏటీఎం కేంద్రాల వద్ద సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!

సైబర్ నేరగాళ్లు అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఏటీఎం (ATM) కేంద్రాల వద్ద కాపుకాస్తారు. వారు చాలా తెలివిగా తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డు పని చేయడం లేదని లేదా ఫోన్ లో ఇంటర్నెట్ సమస్య ఉందని నమ్మిస్తారు. “మాకు అత్యవసరంగా నగదు కావాలి, మీకు యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తాం’ అని బ్రతిమాలుతారు. లేదంటే మా ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్‌కు డబ్బు పంపాలి.. కానీ, తమ యూపీఐ పని చేయడం లేదని మీకు క్యాష్ ఇస్తాం మీరు ఫలానా నంబర్‌కు యూపీఐ ద్వారా డబ్బు పంపాలంటూ చాలా స్వీట్‌గా రిక్వెస్ట్ చేస్తారు. అవసరం అయితే కమీషన్ కూడా ఇస్తామని ఆశ చూపిస్తారు. చేతికి నగదు వస్తోంది కదా అని ఆశపడి లేదా సహాయం చేద్దామని భావించి ఎవరైనా వారి యూపీఐ కి నగదు పంపితే ప్రమాదంలో పడ్డట్లే. ఎందుకంటే, ఆ నేరగాళ్లు పంపిన నగదు లేదా మీ ఖాతాలోకి వచ్చిన సొమ్ము ఏదైనా సైబర్ క్రైమ్ ద్వారా సంపాదించినది అయి ఉంటుంది. పోలీసులు నేర విచారణలో భాగంగా ఆ నగదు ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అయిందో గమనిస్తూ, మీ ఖాతాను కూడా నేరంతో సంబంధం ఉన్న ఖాతాగా గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేస్తారు.సో జాగ్రత్త ‼️