seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 6:26 pm Digital Edition : SEEMA KIRANAM

ఏఎస్‌పేట దర్గా వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై జిలాని

ఏఎస్‌పేట దర్గా వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై జిలాని

 

నెల్లూరు, ఆత్మకూరు,ఏఎస్‌పేట, జూన్ 04, (సీమకిరణం న్యూస్): 

ఏఎస్‌పేట దర్గా వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ ప్రతి శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై జిలాని తెలిపారు. శుక్రవారం దర్గా వద్దకు సిబ్బందితో చేరుకున్న ఆయన, అక్కడికి వచ్చిన భక్తుల వివరాలను నమోదు చేసి గుర్తింపు పత్రాలను పరిశీలించారు. పుణ్యక్షేత్రాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులు తప్పనిసరిగా ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. రాత్రి వేళల్లో దర్గా సిబ్బందితో పాటు పోలీసులు పహారా నిర్వహించి భద్రత కల్పిస్తారని తెలిపారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమను సంప్రదించవచ్చని ఎస్సై జిలాని సూచించారు..