seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 12:24 pm Digital Edition : SEEMA KIRANAM

ఎపిస్టీన్ ఫైల్స్: రాహుల్ గాంధీ ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్! | ఎప్స్టీన్ ఆరోపణలపై రాహుల్ గాంధీని దూషించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అధికారిక 2009 IPI సమావేశాన్ని స్పష్టం చేశారు

భారతదేశం

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

వివాదస్పద అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఘాటుగా స్పందించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి తనపై వచ్చిన వార్తలపై ఆయన పార్లమెంటు వెలువల క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఆరోపిణలు చేయడం అలవాటుగా మారిందని.. ఆయన కామెంట్స్ వినోదం కోసం మాత్రమేనని ఎద్దేవా చేశారు.

ఎప్‌స్టీన్‌తో భేటీ వెనుక అసలు నిజం
ఎప్‌స్టీన్‌ను తాను కలిసిన మాట వాస్తవమే.. అయితే అది పూర్తిగా అధికారిక, అంతర్జాతీయ ప్రతినిధి బృందంలో చేరిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వివరించారు. ఇది 2009లో జరిగింది. అప్పట్లో హర్దీప్ సింగ్ పూరీ న్యూయార్క్‌లో భారత రాయబారిగా ఉండేవారు. ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌డియంట్ (IPI) ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఉన్నప్పుడు ఎప్‌స్టీన్‌తో 3-4 సార్లు భేటీ అని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ఈ సంస్థకు నేతృత్వం వహించేవారని ఆయన ద్వారానే ఈ పరిచయం ఏర్పడిందని చెప్పారు.

ఎప్స్టీన్ ఆరోపణలపై రాహుల్ గాంధీని దూషించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధికారిక 2009 IPI సమావేశాన్ని స్పష్టం చేశారు

“నవంబర్ 26, 2025న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ నన్ను కలిసి, మీ పేరు ఓ ఆసక్తికరమైన చోట (ఎప్‌స్టీన్ ఫైల్స్) వచ్చిందని కన్ను కొడుతూ చెప్పారు. అప్పుడే నేను ఆయనకు పూర్తి నిజాలు వివరిస్తూ నోట్స్ పంపాను. అయినా సరే పార్లమెంటులో మళ్లీ అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు” అని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీపై తలపోటు వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ పార్లమెంటులో తన ప్రసంగం ముగియగానే వెళ్లీపోతారని, ఇతరుల మాటలు వినే ఓపిక ఆయనకు లేదని పూరీ గుర్తు చేశారు. బ్రెజిల్ మోడల్ ఓటు వేసిందన్న తప్పుడు ప్రచారం నుంచి, రాజ్యాంగం కాపీని గాలిలో ఊపడం వరకు రాహుల్ చేసే పనులన్నీ బాధ్యతారాహిత్యంగా ఉన్నట్లు గుర్తించారు.

భారత ఆర్థిక వ్యవస్థపై స్పందన
ఇండియాను ‘డెడ్ ఎకానమీ’ (మృత ఆర్థిక వ్యవస్థ) అని రాహుల్ గాంధీ పిలవడాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తప్పుబట్టారు. “ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను మేము 4వ స్థానానికి చేర్చాం. త్వరలో 3వ స్థానానికి వెళ్తున్నాం. డెడ్ ఎకానమీ అంటే ఏంటో ఆయన డిక్షనరీ చూసి తెలుసుకోవాలి” అని ఎద్దేవా చేశారు.

ట్రేడ్ అగ్రిమెంట్లపై క్లారిటీ
అంతర్జాతీయ ఒత్తిడితోనే భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోన్న విమర్శలకు బదులిస్తూ.. “భారత జీడీపీలో 50 శాతం ఎక్స్‌టర్నల్ సెక్టార్‌తో ముడిపడి ఉంది. కొంచెం చదువుకోవాలి. మేము తక్కువ సమయంలో 9 వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాం” అని హర్దీప్ సింగ్ పూరీ వివరించారు.

ఆంగ్ల సారాంశం

రాహుల్ గాంధీ ఎప్స్టీన్ ఆరోపణలను నిరాధారమైనవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కొట్టిపారేశారు. అధికారిక IPI ప్రతినిధి బృందంలో భాగంగా 2009లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను కలుసుకున్నట్లు అతను స్పష్టం చేశాడు.

Source link