ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి!
ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్లు దాఖలు.. తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులతో సందడి కర్నూలు ప్రతినిధి, నవంబర్ 22 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి మండలంలోని ఎన్.నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో దేశాయి లక్ష్మీదేవమ్మ, దేశాయి గాయత్రి నిలిచారు. సర్పంచ్ అభ్యర్థులుగా వీరిద్దరూ వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వేర్వేరుగా తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎన్.నగరం గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువకులు, మహిళలు, మద్దతుదారులు వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు....