seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 6:51 am Digital Edition : SEEMA KIRANAM

ఎట్టకేలకు పెన్షన్ రూ 4 వేలకు పెంపు, ముందుగా వారికే – మార్గదర్శకాలు..!! | తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు దశలవారీగా చేయూత పింఛన్ల పెంపునకు కసరత్తు ప్రారంభించింది

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్దమైంది. చేయూత పెన్షన్లు పెంపు పైన కొత్త ఫార్ములా ఆలోచన చేస్తోంది. హామీ అమలు చేస్తూనే.. ఒకే సారి ప్రభుత్వం పైన ఆర్దిక భారం పడకుండా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచనల ప్రకారం ఈ హామీ అమలు పైన బడ్జెట్ లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు సాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా.. పింఛను ఉండటాల వారీగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ రోగులు, డయాలసిస్‌ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.4016 చొప్పున పింఛను ఇస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం-ఎన్నికల హామీ ప్రకారం దశలవారీగా పింఛన్ల పెంపుదలకు కసరత్తు ప్రారంభించింది.

కాగా, పెన్షన్ల పెంపు నిర్ణయం అమల్లోకి తెస్తే.. భారీగా ఆర్దిక భారం పెరిగే అవకాశం ఉండటంతో.. కొత్త ఫార్ములా పైన కసరత్తు చేస్తున్నారు. విడతల వారిగా అమలు చేయటం ద్వారా లబ్దిదారుల్లో కొంత మేర సానుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విడతలవారిగా పెంచితే.. తొలి విడతలో రూ.500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని సమాచారం.

బడ్జెట్ లో స్పష్టత ఇచ్చే విధంగా కసరత్తు

ఎన్నికల సమయంలో ఉచిత హామీ ఇచ్చిన ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, సన్నబియ్యం వంటి హామీలను అమలులోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛను అందుతోంది. ప్రతి నెలా రూ.950 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ పింఛన్‌ను ప్రస్తుతానికి రూ.500 చొప్పున పెంచితే.. నెలకు సుమారు రూ.210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి రూ.2500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనుంది.

తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్‌లో కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. తొలి విడతలో పెంచాలని కోరుకుంటున్నట్లు కూడా కలిపి బడ్జెట్‌లో కేటాయింపులు చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. చేయూత ఫించన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి రూ.4 వేలకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీని పైన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చేలా కార్యాచరణ సిద్దం అవుతోంది.

ఆంగ్ల సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం సామాజిక పింఛన్లను దశలవారీగా 4000 రూపాయలకు పెంచనుంది

Source link