ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి – ఎస్పీ సైబర్ మోసాలు, మహిళల భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచన ఉలిందకొండ, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లు, దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన పెండింగ్...